సన్నీ లియోన్ భర్త డానియెల్ వెబర్ ఆమెకు ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బహుమతిని సిన్నీ లియోన్ కి ఇవ్వడం జరిగింది. భర్త ఇచ్చిన నెక్లెస్ మెడలో ధరించిన సన్నీ లియోన్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. భర్త ప్రేమ కానుక గురించి తన అభిమానులకు తెలిసేలా వీడియో చేశారు. 


మన 13ఏళ్ల పరిచయంలో 11ఏళ్ల వివాహబంధం మనది. నువ్వు ఇచ్చిన ఈ బహుమతి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మన జీవన ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుందని ఒకరికొకరం చేసుకున్న ఒక్క ప్రామిస్‌ వల్ల ఈ రోజు మనం ఈ మనోహరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది... అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు సన్నీ లియోన్. 


పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారిన సన్నీ లియోన్ భర్త డానియెల్ కూడా పోర్న్ స్టార్ కావడం విశేషం. ఆ పరిశ్రమలో ఉన్న పరిచయం కారణంగా 2011లో సన్నీ లియోన్, డానియెల్ వెబర్ వివాహం చేసుకున్నారు. వీరు సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు. అలాగే ఓ అమ్మాయిని దత్తత తీసుకోవడం జరిగింది. 2012లో వచ్చిన జిస్మ్ 2 తో బాలీవుడ్ హీరోయిన్ గా సన్నీ మారారు.


తెలుగులో కూడా సన్నీ లియోన్ నటించడం విశేషం. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంటు తీగ మూవీలో ఆమె ఓ రోల్ చేశారు. అలాగే రాజశేఖర్ హిట్ మూవీ గరుడ వేగ లో స్పెషల్ సాంగ్ చేశారు. ముంబై లో సెటిల్ అయిన సన్నీ లియోన్ నటిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)