సన్నీలియోన్: ప్రతీ 15 నిమిషాలకు అదే పని చేస్తుంటా

Sunny is obsessed with cleaning her feet again and again
Highlights

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. రోజువారీ జీవితంలో వారి అలవాట్లు కూడా భాగంగా 

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. రోజువారీ జీవితంలో వారి అలవాట్లు కూడా భాగంగా మారిపోతుంటాయి. అలానే బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ కు కూడా ఓ అలవాటు ఉందట. అదేంటంటే.. ఈ బ్యూటీ ప్రతి 15 నిమిషాలకు తన పాదాలను శుభ్రంగా క్లీన్ చేస్తుందట.

తన దేహభారాన్ని మోసే పాదాలను ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం అవసరమని, తనపాదాలంటే తనకు చాలా ఇష్టమని వాటిని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటానని చెబుతోంది. తనతో సినిమాలు చేసే వారికి ఈ విషయం తెలిసినప్పటికీ అభిమానులకు మాత్రం ఈ సంగతి తెలియదట. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వీరమహాదేవి' అనే చారిత్రక నేపధ్యమున్న సినిమాలో నటిస్తోంది.

తమిళ భాషలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఇతర దక్షినాది భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. మరో పక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఓ పక్క నటిగా, మరోపక్క నిర్మాతగా సినిమాలు చేస్తుండడంతో సంతోషాన్నిస్తుందని వెల్లడించింది. 

loader