హీరోగా సునీల్ వరస ఫ్లాఫ్ లు వచ్చాయి. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు తప్ప అతని కెరీర్లో హీరోగా చెప్పుకోదగ్గ హిట్ లేదు. వరస ఫ్లాఫ్ లతో చివరకు శాటిలైట్ బిజినెస్ కూడా తన సినిమాలకు కాలేని సిట్యువేషన్ కు చేరుకున్నాడు. దాంతో తిరిగి తను పాతరోజుల్లోకి వెళ్లి కమిడియన్ అవతారం ఎత్తితే కలిసి వస్తుందని డిసైడ్ అయ్యాడు. తన మిత్రులు సలహాలు, సూచనతో కమిడియన్ గా బిజి అయ్యాడు.

అయితే కమిడియన్ కూడా అతనికి ఒక్క సినిమా కూడా విజ‌యం అందించ‌డం లేదు. రీసెంట్ గా విడుద‌లైన "ప‌డి ప‌డి లేచే మ‌న‌సు" సినిమాలోనూ హీరోయిన్ సాయి పల్లవికి ఎన్నారై బావ‌గా న‌టించాడు. కానీ థియోటర్ లో అసలు ఫన్ పండలేదు. సునీల్ వచ్చినా ప్రేక్షకుల్లో సందడి లేదు... ఆ జోష్ లేదు. దానికితోడు ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

అలాగే సునీల్ ఈ సంవత్సరం న‌టించిన అర‌వింద స‌మేత‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, సిల్లీ ఫెలోస్‌... కూడా ఏవీ వ‌ర్క‌వ‌ట్ కాలేదు. అర‌వింద స‌మేత హిట్ అయ్యినా .. సునీల్ కు కలిసొచ్చిందేమీ లేదు. ఎందుకంటే సినిమాలో అతని పాత్ర డ‌మ్మీ. ఫైనల్ గా హీరో నుంచి కమిడియన్ గా వెనక్కి తిరిగి వచ్చినా లాభం లేదు. టోటల్ గా 2018లో సునీల్‌కి బ్యాడ్‌టైమే కంటిన్యూ అయ్యింది.