బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. తెలుగులో రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి రెడీ అవుతోంది. కంటెస్టంట్లుగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఫైనల్ లిస్ట్ రాబోతుంది.

ఇది ఇలా ఉండగా.. స్టార్ మా యాజమాన్యం ఈ షో కోసం పాపులర్ సెలబ్రిటీలను తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలో కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ ని సంప్రదించారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సునీల్ కూడా ఆసక్తి చూపారట. అయితే రోజుకి రూ.25 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగారట.

దీంతో ఖంగుతిన్న షో నిర్వాహకులు అక్కడ నుండి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నిర్వాహకులు క్రేజ్ ఉన్న సెలబ్రిటీలకు రోజుకి లక్ష, మహా అయితే రెండు లక్షలు మాత్రమే చెల్లించారు. అలాంటిది సునీల్ రోజుకి పాతిక లక్షలు అడగడంతో షాక్ అయ్యారు. సినిమాలో నటించడానికి రోజుకి సునీల్ కి ఐదు నుండి పది లక్షలు చెల్లిస్తారు.

అలాంటిది ఆయన టీవీ షో కోసం అంత మొత్తాన్ని అడగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోజుకి ఒకటి నుండి మూడు లక్షల లోపు రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీలను మాత్రమే తీసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇలా చూసుకుంటే సునీల్ ఈ షోలో కనిపించడం కష్టమేనని అంటున్నారు.