సుకుమార్ తో సునీల్ తొలిసారి...షాకింగ్ క్యారక్టరైజేషన్

షెడ్యూల్‌లో సునీల్‌పై సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో సునీల్ భార్యగా నటిస్తోంది. ఇందులో సునీల్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, రెండు షేడ్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. 

Sunil s First Time With Sukumar jsp

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు సునీల్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. ఇందులో మెయిన్ విలన్ పాత్ర కోసం మొదట పలువురి పేర్లు వినిపించాయి.

 ఆ క్రమంలో సునీల్‌ పేరూ ఉంది.  ఫస్ట్ పార్ట్ లో వచ్చే విలన్ గా సునీల్ కనిపిస్తాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఆ షెడ్యూల్‌లో సునీల్‌పై సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో సునీల్ భార్యగా నటిస్తోంది. ఇందులో సునీల్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, రెండు షేడ్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. షాకింగ్ క్యారక్టరైజేషన్ తో సాగుతుందని తెలుస్తోంది. ఈ క్యారక్టరేషన్ పై మీడియాలో రకరకాల కథనాలు వెలబడుతున్నాయి. 

 ఇక సునీల్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘వేదాంతం రాఘవయ్య’.. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి కథనందించడంతో పాటు సమర్పకులుగానూ వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సునీల్‌ ‘ఎఫ్ 2: ఫన్ అండ్‌  ఫ్రస్ట్రేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌ 3’లో చేస్తున్నాడు. 

 ‘మర్యాద రామన్న’ లో తనదైన నటనతో హాస్యం పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సునీల్. తొలుత హాస్య నటుడిగా అలరించి, తర్వాత హీరోగాను కొన్ని చిత్రాలు చేశాడు. ఆ మధ్య రవితేజ నటించిన ‘డిస్కోరాజా’లో విలన్‌గా చేశాడు. తర్వాత ‘కలర్‌ ఫోటో’లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. తను కథానాయకుడిగా తెలుగు, కన్నడంలో తెరకెక్కుతున్న ద్విభాషాచిత్రం ‘డీటీఎస్‌’(డేర్‌ టు స్లీప్‌)లో నటిస్తున్నాడు.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios