చివరగా 2018లో `సిల్లీ ఫెలోస్‌` చిత్రంలో అల్లరి నరేష్‌తో కామెడీ చేసిన వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత కమెడీయన్‌గా బిజీ అయ్యాడు సునీల్‌. మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

కమెడీయన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సునీల్‌.. హీరోగా సక్సెస్‌ కాలేకపోతున్నారు. అంతకు ముందు కొన్ని చిత్రాలు విజయం సాధించినా, ఆ తర్వాత వరుస పరాజయాలు కావడంతో హీరోగా గ్యాప్‌ ఇచ్చాడు సునీల్‌. చివరగా 2018లో `సిల్లీ ఫెలోస్‌` చిత్రంలో అల్లరి నరేష్‌తో కామెడీ చేసిన వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత కమెడీయన్‌గా బిజీ అయ్యాడు సునీల్‌. వరుస ఆఫర్ల దక్కించుకుంటూ కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

ప్రస్తుతం సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రధారులుగా `బుజ్జి ఇలా రా` సినిమాలో నటిస్తున్నారు. `గరుడవేగ` అంజి దర్శకత్వంలో జి. నాగేశ్వర్‌రెడ్డి టీమ్‌ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి `ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్‌` అనేది ట్యాగ్‌లైన్‌. తాజాగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఆస‌క్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్ట‌ర్‌తోనే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్రాఫర్ గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నాయుడు మాట‌ల‌ను అందిస్తున్నారు. చాందిని త‌మిళ‌ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.