సందీప్ కిషన్, హన్సిక నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్ర టీజర్ తాజాగా విడుదలయింది. టీజర్ లో ఉన్న ఫన్ మూమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎలాంటి కేసులు దొరక్క ఖాళీగా ఉండే లాయర్ పాత్రలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

వరలక్ష్మిని కాపాడే లాయర్ ఈ కర్నూలు సిటీలో ఎవ్వరూ లేరు అని మురళి శర్మ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. 'ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ..పేటియంలో పే చేస్తే 50 పెర్సెంట్ క్యాష్ బ్యాక్.. కేసు ఓడిపోతే 100 పెర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్' అంటూ సాగే ఫన్నీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ఆపిల్ బ్యూటీ హన్సిక ఎప్పటిలాగే గ్లామర్ గా కనిపిస్తోంది. కమెడియన్ ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీ బావుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సందీప్ కిషన్ కూడా ఎప్పటి నుంచో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హన్సిక చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇది. దీనితో తెనాలి రామకృష్ణ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.