Asianet News TeluguAsianet News Telugu

సందీప్ కిషన్ క్రేజీ ప్రాజెక్టు, నెట్ ప్లిక్స్ తో , డైరక్టర్ ఎవరంటే...

తాజాగా సందీప్ కిషన్ మరో ప్రాజెక్టు సైన్ చేసారు. అయితే అది వెబ్ సీరిస్ అని తెలుస్తోంది. 

Sundeep Kishan next with Tillu Square Director jsp
Author
First Published Jul 9, 2024, 8:09 AM IST


 సందీప్ కిషన్ కి సరైన హిట్ పడి మూడేళ్లు దాటి పోయింది.  2021లో ‘A1 ఎక్స్‌ప్రెస్’తో హిట్  కొట్టిన సందీప్ కిషన్.. ఆ తరువాత గల్లీ రౌడీ, మెఖైల్, ఊరు పేరు భైరవకోన అంటూ వరస పెట్టి సినిమాలు చేసారు. అయితే ఏ సినిమాతోనూ సరైన సక్సెస్ అందుకోలేదు. దాంతో హిట్ ఇచ్చిన డైరక్టర్స్ తో తన జర్నీ మొదలెట్టాలని ఫిక్స్ అయ్యారు.  ప్రస్తుతం ఈ హీరో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ RSJ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.

అలాగే తాజాగా సందీప్ కిషన్ మరో ప్రాజెక్టు సైన్ చేసారు. అయితే అది వెబ్ సీరిస్ అని తెలుస్తోంది. రీసెంట్ గా సూపర్ హిట్ టాక్  ‘టిల్లు స్క్వేర్’ని డైరక్ట్ చేసిన దర్శకుడు మల్లిక్ రామ్ తో ఈ సిరీస్ ని చేయబోతున్నారట. అల్లరి నరేష్ తో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాని నిర్మించిన రాజీవ్ చిలుక ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ గా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం.  గతంలో ఫ్యామిలీమెన్‌’ వెబ్ సిరీస్‌లో సందీప్ కిష‌న్ న‌టించారు.అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ అయితే కాదు.  ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. 

‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో సందీప్ తన 30వ సినిమాని చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం.  రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ధారి. ఈ చిత్రం కోసం ‘మ‌జాకా’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios