ఇంట్రెస్టింగ్ గా మైఖేల్ మూవీ మేకింగ్.. యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకునేలా సందీప్ కిషన్ ప్రయత్నం
పాపం చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సందీప్ కిషన్. కాస్త గ్యాప్ ఇచ్చి మైఖేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈసారి సరికోత్త ప్రయోగంతో ముందుకు రాబోతున్నాడు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. సాలిడ్ హిట్ పడటంలేదు యంగ్ స్టార్ కు. దాంతో నిరాశలో ఉన్న ఈ హీరో.. తన అదృష్టాన్ని మైఖేల్ సినిమాతో పరీక్షించుకోబోతున్నాడు. ఈసారి అయినా హిట్ పడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు సందీప్ కిషన్.
మైఖేల్' సినిమా ఈ నెల 3వ తేదీన థియేటర్లకు రానుంది. భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ కు పదును పెట్టారు టీమ్. ఈసారి చావో రేవో తేల్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు సందీప్. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నాు. ఈక్రమంలోనే నిన్న రాత్రి విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంటును గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్
ఇక ప్రమోషన్లలో భాగంగా.. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. సరికొత్త యాక్షన్ ఫీట్లతో మెస్మరైజ్ చేసే ప్రయత్నంచేశారు టీమ్. ఇక ఈమూవీలో ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. అనసూయ .. గౌతమ్ మీనన్ లాటి స్టార్స్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. యాక్షన్ సీన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.
అంతే కాదు ఈసినిమా కోసం గట్టిగా కష్టపడ్డాడు సందీప్ కిషన్. ఈక్రమంలోనే ఫైట్స్ లో సందీప్ నిజంగానే గాయపడటం కూడా ఈ వీడియోలో చూపించారు. ఈసారైనా సందీప్ కిషన్ ఈసినిమాతో హిట్ కొడతాడా లేదా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి సందీప్ లక్ ఎలా ఉందో.