దూకుడు పెంచిన యంగ్ హీరో సందీప్ కిషన్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మరో కొత్త మూవీ ప్రారంభం హాజరైన మహేష్ బాబు సోదరి మంజుల, నిర్మాత ఎఎం.రత్నం
యంగ్ హీరో సందీప్ కిషన్ స్పీడ్ మరింత పెంచాడు. ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్లో ‘నక్షత్రం’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సందీప్, తమిళ దర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం తాజాగా ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మహేష్ బాబు సిస్టర్ మంజుల, ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం ఈ ఈవెంట్ ని లాంచ్ చేశారు. బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కృష్ణగాడి వీరప్రేమ గాథ ఫేం మెహ్రీన్ కౌర్ ప్రిజాదా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించనున్నాడు.సుశీంద్రన్ తెరకెక్కించిన తమిళ చిత్రం గతంలో నా పేరు శివ టైటిల్ తో తెలుగులో విడుదలైంది.
