టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌కు కూడా కరెంట్ షాక్ కొట్టింది. తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసిన సందీప్ సోషల్ మీడియా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు` అంటూ కామెంట్ చేశాడు సందీప్.
లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మూడు నెలలుగా కరెంటు బిల్లులు తీయలేదు. దీంతో మూడు నెలల తరువాత వస్తున్న కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. భారీగా సెలబ్రిటీలకు సైతం కరెంట్ బిల్లు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. ఇప్పటికే స్నేహ, కార్తిక, తాప్సీ లాంటి వారు తమకు వచ్చిన కరెంట్ బిల్లుపై అసహం వ్యక్తం చేస్తూ కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌కు కూడా కరెంట్ షాక్ కొట్టింది. తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసిన సందీప్ సోషల్ మీడియా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్‌లైన్లో వార్ ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఈ బిల్లులను చూస్తుంటే కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్‌లా అనిపిస్తోంద`ని ట్వీట్ చేశాడు సందీప్ కిషన్.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు. నరగసూరన్, కన్నడి అనే సినిమాలు చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతుండగా కసడ తపర, ఏ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
