సుమంత్‌ హీరోగా ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. నందితశ్వేత  హీరోయిన్. ‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికీ ఒక కారణం ఉంటుంది’ అంటూ సాగే ఈ చిత్రం కన్నడలో విజయవంతమైన 'కావలూడారి'కి రీమేక్‌. ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మించారు. డా.ధనుంజయన్‌ తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక ఒక బలమైన కారణం ఉంటుందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని ఈ సినిమా కథను రూపొందించారు. వేషాలు మారుస్తూ హత్యలు చేసే నర హంతకుడిని పట్టుకోవడమే ఈ సినిమాలో కీలక అంశం. ఈ సినిమాలో సుమంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం రంగంలోకి దిగిన సుమంత్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ మిస్టరీ వెనుక ఎవరు ఉన్నారు? వేషాలు మార్చి కపటధారిగా ఉన్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సిమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ జి.ధనంజయన్‌, లలిత ధనంజయన్‌ నిర్మిస్తున్నారు.  


సుమంత్‌ సరసన నందిత శ్వేత, పూజాకుమార్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోనీతో 'భేతాళుడు' తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ధ‌నంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేయగా.. బాషాశ్రీ ఈ చిత్రానికి మాట‌లు రాశారు. ‘కపటధారి’ తొలి కాపీ సిద్ధమైంది. మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.