క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల కొన్ని సార్లు సీరియల్స్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు భార్య సుమ యాంకర్ గా కనకాల ఫ్యామిలీ ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు సుమ - రాజీవ్ దంపతులు సినిమాల వైపు కూడా దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల కొన్ని సార్లు సీరియల్స్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు భార్య సుమ యాంకర్ గా కనకాల ఫ్యామిలీ ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు సుమ - రాజీవ్ దంపతులు సినిమాల వైపు కూడా దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతగా కాకుండా ముందుగా డిస్ట్రిబ్యూటర్ గా అవతారమెత్తనున్నారట.
కొంత మంది ఎన్నారైలతో కలిసి టాలీవుడ్ కి సంబందించిన సినిమాల ఓవర్సీస్ హక్కులను అందుకొని అమెరికాలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో మొదటగా మెగా పవర్ స్టార్ సినిమాపై కన్నేశారు. బోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రంగస్థలం అందించిన కలెక్షన్స్ ఈ సినిమాకు మంచి మార్కెట్ ను సెట్ చేస్తున్నాయి.
అమెరికా హక్కులకు దాదాపు 12 నుంచి 15 కోట్ల ధర పలికింది. దీంతో రాజీవ్ కనకాల కొందరు బ్రిటన్ ఎన్నారైలను కలుపుకొని రైట్స్ దక్కించుకున్నట్లు టాక్. రంగస్థలం సినిమా అమెరికాలో సుమారు 24కోట్లు (3.5 మిలియన్ డాలర్లు పైగా) వసూలు చేయడంతో ఈ సారి కూడా అంతకంటే ఎక్కువే అందుతాయని తెలుస్తోంది. అయితే బోయపాటి గత సినిమాలు ఓవర్సీస్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. మరి ఈ సినిమా ఎంతవరకు కనకాల ఫ్యామిలీకి కలిసి వస్తుందో చూడాలి.
