Asianet News TeluguAsianet News Telugu

Pushpa 2: సుకుమార్ కి పట్టు దొరకట్లేదా.. తన అసిస్టెంట్స్ తో కలసి మేధోమథనం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. సెలెబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు.. దేశవిదేశాల్లోని సినీ లవర్స్ అంతా పుష్ప చిత్రంలోని డైలాగులు, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ని అనుకరిస్తున్నారు.

Sukumar working hard to get Pushpa 2 script perfect
Author
Hyderabad, First Published Jul 4, 2022, 2:20 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ రోజు రోజుకి ఎల్లలు దాటుతోంది. సెలెబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారులు.. దేశవిదేశాల్లోని సినీ లవర్స్ అంతా పుష్ప చిత్రంలోని డైలాగులు, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ని అనుకరిస్తున్నారు. అంతలా పుష్ప మొదటి భాగం క్రేజ్ వ్యాపించింది. 

పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై ఇప్పుడు అంచనాలు మాములుగా లేవు. దీనితో పుష్ప 2లో కథ యూవర్సల్ అప్పీల్ ఉండేలా.. మొదటి భాగంకి సరైన కొనసాగింపు ఉండేలా సుకుమార్ చాలా కాలంగా కష్టపడుతున్నారు. కానీ పుష్ప 2 కథపై పూర్తి స్థాయిలో గ్రిప్ దొరకలేదనే ప్రచారం జరుగుతోంది. 

సినీ వర్గాల సమాచారం మేరకు సుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో తన అసిస్టెంట్స్ తో కలసి పుష్ప 2 సన్నివేశాలపై మేధోమథనం చేస్తున్నారట. చిన్న సన్నివేశం విషయంలో కూడా సుకుమార్ రాజీ పడడం లేదని తెలుస్తోంది. 

కనీసం సెప్టెంబర్ నుంచి అయినా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అప్పటిలోపు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి.. కాస్టింగ్ ని ఎంపిక చేయాల్సి ఉంది. పార్ట్ 1 ని మించేలా ఉంటేనే పుష్ప 2 అంచనాలని అందుకుంటుంది. ఈ విషయం తెలిసిన సుకుమార్ ప్రస్తుతం కథపైనే ఫోకస్ పెట్టారు. పుష్ప 2తో ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. 

Follow Us:
Download App:
  • android
  • ios