Asianet News TeluguAsianet News Telugu

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,సుకుమార్ కొలాబిరేషన్ లో చిత్రం

ఒక పక్క హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారిందన్న

Sukumar to work with People Media Factory? jsp
Author
First Published Aug 27, 2024, 3:33 PM IST | Last Updated Aug 27, 2024, 3:33 PM IST


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఇండస్ట్రీలో హ్యాపినింగ్  ప్రొడక్షన్ హౌస్. సాధ్యమైనంత స్పీడుగా  100 సినిమాలు చేయాలనే టార్గెట్ తో సినీ రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని ఎక్కువ ఫెయిల్యూర్సే పలకరిస్తున్నాయి. ఒక పక్క హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారిందన్నమాటే కానీ పెద్ద గాకలిసి వచ్చిందేమీ కనపడటం లేదు.

   ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నారు కానీ సరైన హిట్ పడి ఉత్సాహం ఇవ్వటం లేదు . రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రిలీజ్ చేసారు. ఈ సినిమా డిజాస్టరప్ అయ్యి  సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే ఆయన తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో ముందుకు వెళ్ళాలని ఆయన డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సుకుమార్ తో మీటింగ్ లు జరుపుతున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సమాచారం. 

మొదటి నుంచి సుకుమార్ తన అసిస్టెంట్లు మరియు రైటింగ్ టీమ్‌కి గొప్ప సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తన అసిస్టెంట్లందరినీ పరిచయం చేసే బాధ్యత తీసుకున్న ఏకైక  దర్శకుడు సుకుమార్ ని చెప్పవచ్చు . ఇప్పటికి ఆయన టీమ్ నుంచి వ చ్చిన సూర్య ప్రతాప్, బుచ్చిబాబు మంచి విజయం సాధించారు. బుచ్చిబాబు తన రెండవ దర్శకత్వంలో రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే  సుకుమార్ పూర్తిగా ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నాడు. సుకుమార్ ఇప్పుడు తన టీమ్ నుండి మరో అసిస్టెంట్‌ని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే  ఈ చిత్రం 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.

అలాగే ఎప్పటిలాగే సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్‌కి సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అఫీషియల్ గా  తెలియజేయబడతాయి. సుకుమార్ ఇప్పటిదాకా మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు.  ఇది సుకుమార్, టిజి విశ్వ ప్రసాద్‌ల ఫస్ట్ కొలాబిరేషన్. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో తనతో పని చేస్తున్న చాలా మంది అసిస్టెంట్లను పరిచయం చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడు. సుకుమార్ కూడా తెలుగు సినిమాకి చెందిన అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లతో  కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి,  అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తన తదుపరి దర్శకత్వం వహించే పుష్ప 2: ది రూల్‌పై పూర్తిగా దృష్టి పెట్టారు. డిసెంబర్ 6న సినిమా విడుదల కానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios