విరూపాక్ష విజయంలో సుకుమార్ పాత్ర ఎంత ఉందనే విషయాన్ని బయటపెట్టాడు కార్తీక్ దండు. ఈ సినిమాలోకి సాయితేజ్ రావడానికి కూడా సుకుమార్ కారణం అంట.


దర్శకుడు కార్తిక్ వర్మ తెరకెక్కించిన ‘విరూపాక్ష’ చిత్రం సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసందే. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సాయిధరమ్ తేజ్ ), సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది సుప్రీం హీరో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయిధరమ్ తేజ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే, ‘విరూపాక్ష’ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కావడంలోనూ తనే కీలక పాత్ర పోషించి, కార్తీక్ వర్మను దర్శకుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం సినిమా కూడా హిట్ అవడంతో సుక్కు చాలా ఆనందంగా ఉన్నారు. దాంతో ఆయన తన టీమ్ ని ఉద్దేశించి ఓ స్పెషల్ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

View post on Instagram

సినిమా పై స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. వావ్ అని మాత్రమే చెప్పగలను అంటూ విరూపాక్ష ను ఉద్దేశించి సుకుమార్ పోస్ట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని, నువ్ స్క్రిప్ట్ ను నేరెట్ చేసినప్పుడే నాకు తెలిసింది. కానీ, 24 క్రాఫ్ట్స్ ను ఉపయోగించి అద్భుతమైన విజువల్స్ ను స్క్రీన్ పై చూపిస్తావ్ అని అనుకోలేదు అంటూ డైరెక్టర్ కార్తీక్ ను ఉద్దేశించి అన్నారు. ఈ ప్రాజెక్ట్ ను నమ్మి చేసినందుకు హీరో సాయి ధరమ్ తేజ్ ను ప్రశంసించారు. అంతేకాక చిత్రం కోసం వర్క్ చేసిన వారిపై ప్రశంసలు కురిపించారు.

 దీనిపై ప్రత్యేకంగా స్పందించాడు దర్శకుడు కార్తీక్ దండు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన సుకుమార్ కు ఫుల్ క్రెడిట్ ఇచ్చాడు. సుకుమార్ లేకపోతే సినిమా క్లైమాక్స్‌ అంత బాగా వచ్చి ఉండేది కాదంటున్నాడు కార్తీక్. “సుకుమార్‌ గారి దగ్గరకు వెళ్లడానికి ముందు చాలా చిన్న స్పాన్‌లో అనుకున్నాను. కానీ ఆయన కథ విన్న తర్వాత సాయితేజ్‌, నిర్మాత ప్రసాద్‌గారిని డిసైడ్‌ చేశారు. అక్కడి నుంచి అందరం కలెక్టివ్‌ డిసిషన్‌ తీసుకున్నాం. నా డ్రాఫ్ట్ అయ్యాక సుకుమార్‌ దగ్గరకు వెళ్లాక 6, 7 వెర్షన్లు స్క్రీన్‌ప్లేకి చేశాం. కథ మారలేదు కానీ, ట్రీట్‌మెంట్‌ మారుతూ వచ్చింది. అన్ని వెర్షన్లు రాసిన తర్వాత అందులోంచి బెస్ట్ తీసుకున్నాం.” అన్నారు.