ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుష్ప ది రూల్ రిలీజ్ చేసే దిశగా సుక్కు అండ్ టీం వర్క్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుష్ప ది రూల్ రిలీజ్ చేసే దిశగా సుక్కు అండ్ టీం వర్క్ చేస్తున్నారు. పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెట్ చేసిన క్రేజ్ ని అంతా ఇంతా కాదు. దీనితో పుష్ప ది రూల్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సుకుమార్.. మొదట భాగాన్ని మించేలా భారీ కథ అంతకి మించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. 

అల్లు అర్జున్ పాత్ర ఎలాగు పవర్ ఫుల్ గా ఉంటుంది. ఫీమేల్ లీడ్ రష్మిక పాత్ర ఎలా ఉంటుంది ? ఆమెకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా ? లేక పాత్ర నిడివి తగ్గుతుందా ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుకుమార్.. రష్మిక పాత్ర ప్రాధాన్యత తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. 

పుష్ప 2లో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొదటి పార్ట్ లో ఆయన లేరు. అల్లు అర్జున్, జగపతి బాబు మధ్య ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ ఎలాగు ఉన్నాడు. సునీల్, అనసూయ, ధనుంజయ లాంటి ప్రధాన నటుల పాత్రలు పుష్ప 2లో కొనసాగనున్నాయి. అందువల్ల కూడా రష్మిక పాత్రకి ప్రాధాన్యత తగ్గి ఉండొచ్చు. సుకుమార్ నిర్ణయం ఆషామాషీగా ఉండదు కానీ.. ఆమె పాత్ర మరీ తక్కువగా ఉంటే ఫ్యాన్స్ చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది. 

పుష్ప చిత్రాన్ని సుకుమార్ ఎక్కువగా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లోనే చూపించారు. పుష్ప 2 ఇంటర్నేషనల్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య క్లాష్ తారా స్థాయిలో ఉండబోతోంది. రష్మిక పాత్రకి సంబంధించిన సన్నివేశాలు హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు. పుష్ప 2లో సుకుమార్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్ లో ఫ్లాన్ చేసినా ఆశ్చర్యం అవసరం లేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.