చిరు కాదన్నా...'సాహో' డైరక్టర్ కి ఇంకో హీరో సెట్టయ్యాడు
భారీ బడ్జెట్, ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉన్నా హిట్ కొట్టకపోవటం అతని కెరీర్ పై దెబ్బకొట్టింది. అప్పటికీ మొన్నామధ్య లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ ని సంప్రదించినా ..ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్..హింది డెబ్యూకోసం అతన్ని పిలిచినట్లు సమాచారం. హిందీ సర్కిల్స్ లో సాహో ఆడటం అతనికి కలిసొచ్చింది.
సుజీత్ గుర్తున్నాడా...ప్రభాస్ తో సాహో చేసి ఆ తర్వాత రేసులో వెనకబడిపోయాడు. ఆ సినిమా తెలుగులో ప్లాఫ్ అవటం అతని ఆఫర్స్ పై దెబ్బకొట్టింది. శర్వాతో చేసిన రన్ రాజా రన్ చిత్రం సూపర్ హిట్ అయినా ఆ మ్యాజిక్..సాహో లో కనిపించలేదు. భారీ బడ్జెట్, ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉన్నా హిట్ కొట్టకపోవటం అతని కెరీర్ పై దెబ్బకొట్టింది. అప్పటికీ మొన్నామధ్య లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ ని సంప్రదించినా ..ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్..హింది డెబ్యూకోసం అతన్ని పిలిచినట్లు సమాచారం. హిందీ సర్కిల్స్ లో సాహో ఆడటం అతనికి కలిసొచ్చింది. హిందీ సర్కిల్స్ లో బిజినెస్ పరంగా అతని కొంత క్రేజ్ ఏర్పడింది. అది బెల్లంకొండ ..హిందీ డెబ్యూకు పనికి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రభాస్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ఒకటైన ‘ఛత్రపతి’ (2005)ని బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డైరెక్ట్ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్ కోసం ఇప్పటికే ఓ ఫోటోషూట్ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయమని సుజీత్ ని ఆహ్వానించారట. సుజీత్ ..ఇప్పటికే ఈ సినిమా విషయమై రెండు మూడు...కొత్త ట్విస్ట్ లు చెప్పారట.దాంతో ఈ సినిమా హిందీ వెర్షన్ కు సరిపడే స్క్రిప్టు రాసుకురమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక హిందీ డబ్బింగ్ మార్కెట్ బెల్లంకొండ శ్రీనివాస్ కలగి ఉండటం విశేషం.యూట్యూబ్ లో అతని హిందీ డబ్బింగ్ సినిమాలు రికార్డు స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటున్నాయి.ఈ మధ్యకాలంలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కవచం అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజ్ అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు.హిందీలో ఇన్స్పెక్టర్ విజయ్ గా డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో ఉన్నారు.ఇక ఈ సినిమా ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.