బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరో గా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల్లో నటించాడు. సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర.
బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరో గా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల్లో నటించాడు. సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. గతంలో కంటే ఈ చిత్రానికి కాస్త ఎక్కువ హంగామానే ప్రమోషన్స్ లో కనిపించింది.
అయితే ఈ చిత్రం థియేటర్స్ లో ఏమాత్రం రాణించలేదు. డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని బోల్తా పడింది. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ ల యానిమల్ చిత్రంతో పాటు రిలీజ్ చేయడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది. ఊహించినట్లుగానే సుధీర్ కాలింగ్ సహస్ర చిత్రాన్ని యానిమల్ ముంచేసింది.
అసలు ఎవరో తెలియని వ్యక్తుల నుంచి సుధీర్ కి వరుసగా ఫోన్ కాల్స్ రావడం.. సహస్ర గురించి ఆరా తీయడం అనే అంశంతో ఈ చిత్ర కథ ఉంటుంది. క్రైమ్, టెక్నీకల్ అంశలని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే లాజికి ఏమాత్రం సంబంధం లేకుండా కథ కథనాలు కాగడంతో ప్రేక్షకులకు ఈ మూవీ ఎక్కలేదు.
ఈ చిత్రం రిలీజై నెలరోజులు గడుస్తోంది. అప్పుడే ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో కాలింగ్ సహస్ర చిత్రం తాజాగా స్ట్రీమింగ్ మొదలైంది. సుడిగాలి సుధీర్ పెర్ఫామెన్స్ చూడాలనుకునే వారు ఈ న్యూ ఇయర్ కి ఇంట్లోనే కూర్చుని మూవీ చూస్తూ టైం పాస్ చేయొచ్చు.
