Asianet News TeluguAsianet News Telugu

వచ్చే నెలలోనే సుధీర్ బాబు త్రిపుల్ యాక్షన్.. ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

నైట్రో స్టార్, యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘మామా మశ్చీంద్ర’. త్రిపాత్రాభినయంతో అలరించబోతున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. 

Sudheer Babus Mama Mascheendra movie Release date Fix NSK
Author
First Published Sep 7, 2023, 4:49 PM IST

యంగ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమైంది. శివ మనస్సులో శృతి (SMS) అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యాడు. తొలిచిత్రంతోనే డాన్స్, ఫిట్ నెస్, యాక్షన్ అంశాలతో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ వెంటనే వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’తో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంతంత మాత్రానే ఆడాయి. ‘వీ’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, హిందీలో నటించి ‘భాగీ’ చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది.

నెక్ట్స్ రాబోయే చిత్రాలో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈక్రమంలో సుధీర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra).  చిత్రానికి హర్షవర్దన్ దర్శకత్వం  వహిస్తున్నారు.  తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్, తదితర కార్యక్రమాలన్నీంటిని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 

కొద్దిరోజులుగా ఎలాంటి సందడి చేయని యూనిట్ సడెన్ గా చిత్ర విడుదల తేదీని ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది. ‘మామా మశ్చీంద్ర’ చిత్రాన్ని 2023 అక్టోబర్ 6న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. త్రిపుల్ ఫన్, ఎమోషన్, డ్రామా, యాక్షన్ ఉంటుందని తెలిపారు. ఇక నేటితో సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజులే మిగిలింది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇక చిత్రంలో సుధీర్ బాబు తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు. దుర్గ, పరుశురామ్, డీజేగా మూడు రోల్స్ లో అలరించబోతున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios