Asianet News TeluguAsianet News Telugu

`వి` ట్రైలర్‌.. హాలీవుడ్ యాక్షన్‌ హీరోలా సుధీర్ బాబు!

`వి` సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు సుధీర్‌ బాబు. ట్రైలర్‌ చూస్తే పర్ఫామెన్స్‌ పరంగానూ ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటి పడినట్టుగా ఉంది. క్యాట్‌ అండ్ మౌస్‌ గేమ్‌ తరహాలో సాగే ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్షన్‌ స్పెషల్ ఎట్రాక్షన్‌ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

Sudheer Babu stunning action sequences in Nani V Movie
Author
Hyderabad, First Published Aug 26, 2020, 3:55 PM IST

నేచురల్‌ స్టార్ నాని, మ్యాన్లీ హీరో సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించాడు. నాని తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండగా సుధీర్ బాబు యాక్షన్‌ హీరోగా కనిపించనున్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్‌లో సుధీర్‌ బాబు యాక్షన్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

సిక్స్‌ ప్యాక్‌ బాడీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు సుధీర్‌ బాబు. ట్రైలర్‌ చూస్తే పర్ఫామెన్స్‌ పరంగానూ ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటి పడినట్టుగా ఉంది. క్యాట్‌ అండ్ మౌస్‌ గేమ్‌ తరహాలో సాగే ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్షన్‌ స్పెషల్ ఎట్రాక్షన్‌ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌. తన ఫిజిక్‌, యాక్షన్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులతో సైతం వావ్‌ అనిపించిన సుధీర్ బాబు, ఇప్పుడు మరో మెట్టు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు.

వి సినిమా కోసం సుధీర్ బాబు కొన్ని రిస్కీ యాక్షన్‌ సీన్స్‌ లో కూడా నటించాడు. డూప్‌ లేకుండా స్వయంగా స్టంట్స్‌ చేసి యూనిట్‌కు షాక్‌ ఇచ్చాడు. ఆ సీన్స్‌ తెర మీదే చూస్తే ఆడియన్స్‌ కూడా షాక్‌ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. అంతటి రిస్కీ సీన్స్‌ చేసేందుకు సుధీర్ బాబు పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుందంటున్నారు యూనిట్ సభ్యులు.

లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ అభిమానులు సరైన ఎంటర్‌టైన్మెంట్‌ లేక బోర్ ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ అయిన వావ్ అనిపించే కంటెంట్‌ ఇంత వరకు రాలేదు. ఈ సమయంలో అభిమానుల ఆకలి తీర్చేందుకు అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కు రెడీ అవుతున్న సినిమా `వి`

Follow Us:
Download App:
  • android
  • ios