Asianet News TeluguAsianet News Telugu

సుధీర్ బాబు 'హరోం హర' ఒడ్డున పడిందా, కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

ట్రేడ్ లెక్కల ప్రకారం హరోంహర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే  సుమారు ఆరున్నర కోట్ల షేర్ రావాలి. కానీ అదింకా అందుకునే పరిస్దతి లేదంటున్నారు. 

Sudheer Babu Harom Hara Movie collections jsp
Author
First Published Jun 20, 2024, 2:40 PM IST | Last Updated Jun 20, 2024, 2:40 PM IST


వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న సుధీర్ బాబు తన కొత్త సినిమా హరోం హర లో  కొత్తగా చేసాడు.  25 రోజులు రియల్ వర్షంలో షూట్ చేయడం, ఫుల్ యాక్షన్ సీన్స్, బాడీ పరంగా ఫిట్ గా కనిపిస్తూ సుధీర్ హరోం హర కోసం బాగా వర్క్ చేసాడు. అలాగే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండటంతో సినిమాపై  బాగానే బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. కానీ రివ్యూలు డివైడ్ కావటం, టాక్ కూడా అనుకున్నంత గొప్పగా స్ప్రెడ్ కాకపోవటం మైనస్ గా మారింది. దాంతో 2వ రోజు నుండి  కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. 4వ రోజు బక్రీద్ హాలిడేని కూడా ఈ మూవీ క్యాష్ చేసుకుంది లేదు. 


ఈ సినిమా కోసం నవ దళపతి అనే కొత్త బిరుదు పెట్టుకుని ఊర మాస్ కంటెంట్ తో వచ్చిన   ఫలితం ఇవ్వలేకపోయిందనేది స్పష్టం.. అయితే గత డిజాస్టర్లు అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ లాంటి వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా బెస్ట్. ఫస్ట్ వీకెండ్ మాస్ జనం అననివ్వడి, లేదా మరొకరు అననివ్వండి కలెక్షన్స్  పర్వాలేదనిపించిన హరోంహర సోమవారం నుంచి కాస్త ఎక్కువ డ్రాప్ నమోదు చేయడం నిర్మాతలను నిరాశ కలిగించే అంశం.
 
ట్రేడ్ లెక్కల ప్రకారం హరోంహర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే  సుమారు ఆరున్నర కోట్ల షేర్ రావాలి. కానీ అదింకా అందుకునే పరిస్దతి లేదంటున్నారు. ఎందుకంటే అందుకు  రెట్టింపు గ్రాస్ వస్తేనే షేర్ కనపడుతుంది. అంటే 13 కోట్లు అయినా గ్రాస్ కనపడాలి. అంత గ్రాస్  కావాలంటే వీక్ డేస్ లోనూ మంచి ఆక్యుపెన్సీలు పడాలి.  మొదటి రెండు మూడు రోజులు కోటికి పైగా గ్రాస్ వచ్చినా ఆ తర్వాత బాగా డ్రాప్ అయ్యిందంటున్నారు. అంతేకాదు పోటీగా విజయ్ సేతుపతి మహారాజ చిత్రం సూపర్ హిట్ అవటంతో , ఆ సినిమా  నుంచి వచ్చిన తీవ్రమైన పోటీ దెబ్బ పడేలా చేసింది. నిర్మాతలు ప్రమోషన్స్ సైతం ఆపేసారు.

 ‘హరోం హర’ సినిమా బతకడానికి ఓ ఊరు వచ్చిన హీరో అనుకోకుండా గన్స్ తయారీ బిజినెస్ లోకి దిగి ఆ ఊరికి దేవుడు లాంటి మనిషి ఎలా అయ్యాడు అనేది ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో చెప్పారు. సాంకేతికంగా మాత్రం చాలా బాగుంది అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త కలర్ ప్యాలెట్ తో చాలా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 
 

కథేంటి

కుప్పం నేపధ్యంలో ఎనభైల్లో జరిగే కథ ఇది. అప్పట్లో ఆ ప్రాతాన్ని మకుటం లేని మహారాజుల్లా  తిమ్మారెడ్డి , అతని సోదరుడు బసవ(రవి కాలె), కొడుకు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) పాలిస్తూంటారు. వాళ్లు ఏం చెప్తే అది జరగాలి. వాళ్లు చెప్పిందే న్యాయం, చట్టం. జనం చివరకు తలెత్తి వాళ్లను చూడాలన్నా చిచ్చు పోసుకుంటూకుంటూంరు. అలా నలిగిపోతున్న వారిని కష్టాలను బయిటపడేయటానికి ఓ సేవియర్ కావాలి. అందుకోసం ఎదురుచుస్తున్నట్లున్నట్లుగా ఉంటుంది సిట్యువేషన్. ఇంతకీ ఆ సేవియర్ ఎవరూ అంటే... సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) .
 
అక్కడికి కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేయటానికి  సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఉద్యోగం లేక  ఆర్థికంగా  ఇబ్బంది పడుతూంటాడు. ఇంటికి వెళ్లిపోదామంటే తండ్రి శివారెడ్డి (వి జయప్రకాశ్) అప్పులు పాలై ఉంటారు.  అప్పులు ఇచ్చినోళ్లు అంతా ఇంటి మీద పడుతూంటారు. వాళ్లకు మూడు నెలల్లో బాకీ తీరుస్తానని వాళ్లకు మాట ఇచ్చి మరీ  కుప్పం వస్తాడు. 
 
అప్పుడు తన ప్రెండ్ ఆల్రెడీ  సస్పెండెడ్ కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు ఒక బ్లూ ప్రింట్ కూడా ఉండటం గమనిస్తాడు. అంతే అక్కడ నుంచి తన లైఫ్ మార్చుకుంటాడు. పళని స్వామి (సునీల్)తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఆ బిజినెస్ లో భారీగా సంపాదించే సుబ్రమణ్యంకి శత్రువులు తయారుఅవుతారు. ఈ క్రమంలో తమ్మి రెడ్డి కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) మనుషులతో స్నేహం ఏర్పడుతుంది. కానీ.. ఒక రోజు తన తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రమణ్యం కొడతాడు.అసలు శరత్ రెడ్డికి, సుబ్రమణ్యం తండ్రికి మధ్య గొడవలేంటి..చివరకి  సుబ్రహ్మణ్యం పరిస్దితి ఏమైంది.  ఆ ఊరువారు ఆశించినట్లుగా అతను వాళ్లకు సేవియర్ గా మారాడా...   ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారు? లాంటి విషయాలు మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios