Asianet News TeluguAsianet News Telugu

చీర కొంగుతో యావర్ కి శుభ శ్రీ తెలుగు పాఠాలు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ..

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 షోలో గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా కాస్త ఫన్ గా సాగింది. నేటి ఎపిసోడ్ యావర్ కి తెలుగు పాఠాల పేరుతో ఫన్నీగా మొదలయింది.

Subhasri teaches Telugu To yavar in bigg boss house in romantic way dtr
Author
First Published Oct 5, 2023, 10:25 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 షోలో గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా కాస్త ఫన్ గా సాగింది. నేటి ఎపిసోడ్ యావర్ కి తెలుగు పాఠాల పేరుతో ఫన్నీగా మొదలయింది. యావర్ హౌస్ లో ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ మాట్లాడుతుండడంతో బిగ్ బాస్ ఈ టాస్క్ క్రియేట్ చేశారు. 

అతడి పెయిర్ గా వ్యవహరిస్తున్న తేజని ఇరికిస్తూ బిగ్ బాస్ ఈ టాస్క్ క్రియేట్ చేశారు. యావర్ కి ఇంటి సభ్యులంతా ఐదేసి తెలుగు పదాలు నేర్పించాలి. తేజ అతడికి పంతులుగా వ్యవహరించాలి. ఒక వేళ యావర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంటి సభ్యులు తేజని శిక్షించవచ్చు. తేజ చేత గుంజీళ్లు పెట్టించవచ్చు అని బిగ్ బాస్ తెలిపారు. 

దీనితో ఒక్కొక్కరుగా యావర్ కి తెలుగు పదాలు నేర్పించారు. అయితే యావర్ స్టూడెంట్ గా అల్లరి చేశాడు. పంతులమ్మగా వచ్చిన శుభ శ్రీ తెలుగు పదాలు నేర్పించాల్సింది పోయి యావర్ కి ప్రేమ పాటలు నేర్పించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ యావర్ ని తెలుగు చెప్పమని చెప్పింది. దీనితో ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. తన కొంగుని యావర్ కి ఇచ్చి శుభశ్రీ చిలిపిగా ప్రవర్తించింది. 

ఇక అనంతరం బిగ్ బాస్ హౌస్ ఎమోషనల్ గా మారింది. ఇంటి సభ్యులకు వారి కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు వచ్చాయి. దీనిని కూడా బిగ్ బాస్ టాస్క్ గా మార్చారు. ఇది చిట్టి ఆయిరే అనే టాస్క్. ఇంట్లో పెయిర్ లుగా ఉన్న వాళ్లలో ఒక్కరికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన లెటర్ చదివే ఛాన్స్ ఉంటుంది. మరొకరు త్యాగం చేయాల్సి ఉంటుంది. అది పెయిర్ ఉన్న ఇద్దరే డిసైడ్ చేసుకోవాలి. 

ఇక్కడ మెలిక ఏంటంటే లెటర్ త్యాగం చేసిన వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ లో కంటెండర్స్ గా పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. లెటర్ చదివిన వాళ్ళు మాత్రమే కంటెండర్స్ గా అర్హత సాధిస్తారు అని బిగ్ బాస్ తెలిపారు. ఇది జంటలోని ఆ ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ కావాలని బిగ్ బాస్ అన్నారు. 

ముందుగా శుభ శ్రీ, గౌతమ్ జంట లెటర్స్ దగ్గరకి వెళ్లారు. ఇద్దరూ తమకి లెటర్ కావాలని వాదులాడుకున్నారు. కానీ చివరకు గౌతమ్.. తాను లెటర్ చదివి కంటెండర్ గా అర్హత సాధిస్తానని, విజయం కూడా సాధిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తద్వారా శుభశ్రీని నామినేషన్స్ నుంచి సేఫ్ చేస్తానని హామీ ఇచ్చాడు. దీనితో శుభశ్రీ తన లెటర్ ని త్యాగం చేస్తూ కంటతడి పెట్టుకుంది. ఇక తేజ, యావర్ జంటలో యావర్ తన లెటర్ ని త్యాగం చేసి తేజకి అవకాశం ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios