Asianet News TeluguAsianet News Telugu

Kanal Kannan: ప్రముఖ ఫైట్ మాస్టర్ 'కనల్ కణ్టన్' అరెస్ట్!


ఎన్నో సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన కనల్ కణ్ణన్ అరెస్ట్ అయ్యారు. ఆయన తెలుగు,తమిళ సినిమాలకు ఎక్కువగా పనిచేసారు. స్టార్ ఫైట్ మాస్టర్ కావటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన అరెస్ట్ భయపడి కొద్ది రోజులు పరారీలో ఉన్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరకు ఆయన్ని అరెస్ట్ చేసారు. అందుకు కారణం ఏమిటి...

 Stunt master Kanal Kannan arrested
Author
Chennai, First Published Aug 15, 2022, 2:48 PM IST


   స్టంట్ మాస్టర్ కనల్ కణ్ణన్ ఈ మధ్యకాలంలో  చేసిన ప్రసంగం  తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ప్రసంగం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని అతని పై కేసు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 కనల్ ఆగస్టు 1 వ తారిఖున మధురవాయల్ లో జరిగిన ఓ సభలో పాల్గోన్నారు. ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ.. శ్రీరంగ ఆలయ ద్వారం వద్ద ఉన్న పెరియార్ విగ్రహాన్ని పగలగొట్టి, తొలగించిన రోజు హిందువుల విద్రోహ దినం అవుతుందని ఆవేశంగా అన్నారు. ఇవి అసలే సోషల్ మీడియా రోజులు. దాంతో  ఆ ప్రసంగం సోషల్ మీడియాలో  క్షణాల్లో  వైరల్ అయ్యింది.  ఈ స్పీచ్  పై అభ్యంతరం తెలుపుతూ ఫాదర్ పెరియార్ ద్రవిడర్ కజగం జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ నేఫథ్యంలోనే అతన్ని అరెస్టు చేశారు.
 
  రెండు  వర్గాల మధ్య గొడవలు జరిగేలా మాట్లాడినందుకు అతడిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153 అల్లర్లను ప్రేరేపించడం, ఐపీసీ505(1)(బి) శాంతికి భంగం కలిగించడం లాంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కనల్ పరారీలో ఉన్నాడు. అతడ్ని పాండిచ్చేరిలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు గుర్తించి అతన్నిసైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios