సత్యనారాణయ ఏకారి దర్శకత్వంలో సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం స్టూవర్ట్ పురం. ఆర్కాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గూఢచారి చిత్రంలో నటించిన ప్రీతి సింగ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా స్టూవర్ట్ పురం చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యూఏ' సర్టిఫికేట్ జారీ చేశారు. దీనితో ఈ చిత్రం జూన్ 21న విడుదలకు సిద్ధం అయింది. 

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనితో స్టూవర్ట్ పురం సినిమాపై మంచి హైప్ ఏర్పడిందని దర్శకుడు సత్యనారాయణ తెలిపారు. నరరూప రాక్షసులుగా ప్రవర్తించే స్టూవర్ట్ పురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. హీరోయిన్ తెలివిగా వారిని ఎలా ఎదుర్కొంది అనేదే ఈ చిత్ర కథ. 

అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీతంతో ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి అని దర్శకుడు తెలిపారు. స్టూవర్ట్ పురం చిత్రం ద్వారా చాలా పవర్ ఫుల్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని హీరోయిన్ ప్రీతి సింగ్ తెలిపింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.