Asianet News TeluguAsianet News Telugu

ఆ యువ హీరోతో కత్రినా పెళ్లి ఖాయం?

సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టైలిష్ అయిన యాష్లే కత్రినాకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆమె పెళ్లి బట్టలలో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. అలాగే ఇది నిజం కావాలంటూ కామెంట్ పెట్టారు. దానికి కత్రినా... ధన్యవాదములు అంటూ రిప్లై ఇచ్చింది. 
 

strong buzz katrin kaif ready to marry this young hero ksr
Author
Hyderabad, First Published Jul 22, 2021, 10:03 AM IST

కత్రినా కైఫ్ కెరీర్ బిగినింగ్ లో మల్లీశ్వరి, అల్లరి ప్రియుడు వంటి తెలుగు చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో బిజీ అయ్యాక టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు అమ్మడు. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన కత్రినా కైఫ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. స్టార్స్ తో జతకట్టి అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హిస్టరీ ఆమెకు ఉంది. 


అలాగే కెరీర్ లో వివాదాలు, అఫైర్స్ కూడా ఉన్నాయి. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్బీర్ కపూర్ తో డీప్ లవ్ స్టోరీ నడిపింది కత్రినా. వీరి ఘాడమైన బంధం చూసి పెళ్లి ఖాయం అనుకున్నారు. పీరియడ్ కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ నడిపే రన్బీర్ ఎప్పటిలాగే కత్రినాకు కూడా హ్యాండిచ్చాడు. ఆ తరువాత కండల వీరుడు సల్మాన్ తో చాలా కాలం ఎఫైర్ నడిపారు ఆమె. ఓ దశలో సల్మాన్, కత్రినా పెళ్లి వార్తలు కూడా హల్చల్ చేశాయి. 


తాజాగా యువ హీరో విక్కీ కౌశల్ తో కత్రినా సన్నిహితంగా ఉంటున్నారు. సన్నిహితంగా ఉంటున్నారు అనడం కంటే డేటింగ్ చేస్తున్నారని చెప్పాలి . విందులు, వినోదాలు, విహారాలు చేస్తూ జాలీ లైఫ్ గడుపుతున్నారు. విక్కీతో మాత్రం కత్రినా బంధం పెళ్లితో ముడిపడేట్టు ఉందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టైలిష్ అయిన యాష్లే కత్రినాకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆమె పెళ్లి బట్టలలో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. అలాగే ఇది నిజం కావాలంటూ కామెంట్ పెట్టారు. దానికి కత్రినా... ధన్యవాదములు అంటూ రిప్లై ఇచ్చింది. 


జులై 16న 38వ బర్త్ డే జరుపుకున్న కత్రినా 40లోపే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఆమె పెళ్లి చేసుకోబోయేదిగా కూడా లేటెస్ట్ ప్రియుడు విక్కీ కౌశల్ అంటున్నారు. మరి చూడాలి ఈ ఊహాగానాలు ఎంత వరకు నిజం అవుతాయో.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios