మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. త్రిస్సూర్ నుండి తన స్టార్ ఇమేజ్ ను నమ్ముకొని పోటీ చేసిన సురేష్ తన సత్తా చూపలేకపోయాడు. గత మూడేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.

విద్యార్ధి నాయకుడిగా ఆయన ఎస్ ఎఫ్ ఐ తరఫున ఎన్నో పోరాటాలు చేశారు. ఆ అనుభవం ఈ ఎన్నికల్లో సురేష్ గోపికి ప్లస్ అవుతుందని భావించారు. 2006లో జరిగిన ఎన్నికల్లో  కొందరు నాయకుల తరఫున ప్రచారం చేసిన సురేష్ గోపి ప్రస్తుతం బీజేపీ తరఫున బరిలో నిలిచారు.

సురేష్ గోపికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి టీఎన్ ప్రతాపాన్, సీపీఐ పార్టీ రాజాజీ మాథ్యూ థామస్ ల నుండి గట్టి పోటీ ఎదురైంది. ముందుగా త్రిస్సూర్ నుండి తుషార్ ని బరిలో దించాలని  భావించిన బీజేపీ ఆఖరి నిమిషంలో సురేష్ గోపిని బరిలోకి దించారు. కానీ ఇప్పుడు ఆయన కనీస ప్రభావం చూపలేక వెనుకబడ్డారు.