పొలిటీషియన్ తో స్టార్ హీరోయిన్ ఎఫైర్!

star heroine dating top politician
Highlights

టాలీవుడ్ కు పరిచయమైన ఓ నార్త్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకుంది

టాలీవుడ్ కు పరిచయమైన ఓ నార్త్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకుంది. దాదాపు తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంది. గతంలో తన కో స్టార్స్ తో ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఈమె మాత్రం ఓ రాజకీయ నాయకుడితో డేటింగ్ చేస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఎఫైర్ నడుస్తోందని టాక్.

ఇప్పటివరకు ఈ విషయం గోప్యంగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా వీరి వ్యవహారానికి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో సమాచారాన్ని మాత్రం బయటకు రానివ్వకుండా.. ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకుండా బాగానే కేర్ తీసుకున్నారు. అయితే ఎక్కువ రోజులయితే ఈ రిలేషన్షిప్ కొనసాగదనే క్లారిటీ వారికి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరి కంపనీ మరొకరికి నచ్చడంతో ఉన్నన్నిరోజులు ఎంజాయ్ చేయాలని అనుకున్నారట.  

loader