బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సడెన్ గా ముంబయ్ పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యారు.  హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్లిపోయిన సల్మాన్ మీడియానుఅస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. 

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో న్యూస్ ఐటమ్ గా నిలుస్తూనే ఉన్నారు. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్. ఆయన శుక్రవారం సాయంత్రం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యారు. సాయంత్రం పోలీస్ కార్యాల‌యానికి వచ్చిన సల్మాన్ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో భేటీ అయ్యారు. ఆరువాత అక్కడే కాసేపు ఉన్న స్టార్ హీరో వెంటనే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. 

అయితే అసలు సల్మాన్ ఎందుకు కమీషనర్ ను కలిశారు అన్నదానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. కాని సల్మాన్ కమీషనర్ కార్యాలయంలోంచి బయటకు వచ్చిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. పోలీస్ క‌మిష‌నర్‌ను క‌లిసిన త‌ర్వాత సల్మాన్ మీడియాతో మాట్లాడ‌తారు అని అనుకున్నారు, మీడియా కూడా ఎంతో ఆశతో ఎదుర చూసింది. కాని అస్సలు వాళ్ళను పట్టించుకోకుండానే సల్మాన్ వెళ్లిపోయారు. దీంతో ఏ కార‌ణంతో ఆయ‌న పోలీస్ కమిష‌న‌ర్‌ను క‌లిశార‌న్న అంశం తెలియరాలేదు.

Scroll to load tweet…

ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రకరకాల అభిప్రాయాలు వ్యాక్తం చేస్తున్నారు. నెల క్రితం స‌ల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వహారంపై స‌ల్మాన్ పెద్ద‌గా స్పందించ‌లేదు. అంతేకాకుండా ఆయ‌న స్వ‌యంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. మీడియాలో మాత్రం హడావిడి జరిగింది. సల్మాన్ కు సెక్యూరిటీ కూడా ఇచ్చారు పోలీసులు. ఈక్రమంలోనే ముంబై కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వివేక్ ఫ‌న్సాల్క‌ర్ రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నారు. కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్‌తో తనకు వచ్చిన బెదిరింపుల గురించి చ‌ర్చించేందుకే స‌ల్మాన్ వెళ్లి ఉంటార‌న్న ఊహాగానాలు ఊపు అందుకున్నాయి.