స్టార్ డైరెక్టర్ కు హీరోయిన్ తో ఎఫైర్!

star director's affair with heroine
Highlights

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయనతో పని చేయాలని హీరోలందరూ 

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయనతో పని చేయాలని హీరోలందరూ కోరుకుంటారు. ఇటీవల ఆయన రూపొందించిన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. అయితే ఈ డైరెక్టర్ తనతో సినిమాలు చేసే హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తారనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు సైతం వినిపించాయి. ఒకవేళ వారిని వదిలించుకోవాల్సివస్తే మాత్రం ఎంతోకొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేస్తాడట. అలా ఓ హీరోయిన్ కు మూడు కోట్లు రూపాయలను అందాయని గతంలో చెప్పుకున్నారు. తాజాగా ఈ డైరెక్టర్ మరో హీరోయిన్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం ఏకంగా హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఓ అపార్ట్ మెంట్ కూడా కొనిచ్చాడట.

అయితే ఈ విషయం సదరు డైరెక్టర్ ఫ్యామిలీకు తెలియడంతో ఇంట్లో గొడవలు కూడా జరిగాయట. ఇప్పటికీ ఆ గొడవలు కొనసాగుతున్నాయని సమాచారం. అయినప్పటికీ సదరు డైరెక్టర్ హీరోయిన్ తో క్లోజ్ గా మెలుగుతుండడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. మరి ఇంకెంతమందితో ఈ డైరెక్టర్ ఎఫైర్లు నడిపిస్తారో చూడాలి!

loader