దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ RRR పై కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ కోసం బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇక స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.; అదే విధంగా సినిమాకు సంబందించిన టైటిల్స్ పై కూడా ఆయన వివరణ ఇచ్చారు. సినిమాకు మొదట వర్కింగ్ టైటిల్ కింద RRR అని సెట్ చేశారు. ఆ తరువాత డ్ఆడియెన్స్ కోరిక మేరకు మరికొన్ని టైటిల్స్ వచ్చాయి.

అయితే ఎక్కువ మంది RRR టైటిల్ సెట్ చేయడం బెటర్ అని అన్నారు. కరణ్ జోహార్ కూడా నేషనల్ లెవెల్లో ఈ సినిమాకు కరెక్ట్ గా సరిపోయే పేరు అదేనని అన్నారు. ఇంగ్లీష్ అక్షరాలతో ఉంటే ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్ లో ఈ మల్టీస్టారర్ ను కరణ్ జోహార్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదివరకు జక్కన్న బాహుబలిని నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసి బారి విజయాన్ని అందుకునేలా కరణ్ జోహార్ వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంది.