సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఇర్పాన్ పఠాన్.. వైరల్ అవుతున్న స్టార్ క్రికెటర్ పోస్ట్..
సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్. తలైవాను కలిసిన సంతోషాన్ని తట్టుకోలేకపోయారు ఇర్పాన్. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్. తలైవాను కలిసిన సంతోషాన్ని తట్టుకోలేకపోయారు ఇర్పాన్. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళంలోనే కాదు.. ఓవర్ ఆల్ ఇండియాలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అంటే అభిమానించేవారు ప్రతీ రంగంలో ఉన్నారు. ఆయన్ను ప్రాణంగా అభిమానించే వారు సెలబ్రిటీలలో కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా స్టార్ క్రికెటర్ ఇర్పాన్ పటాన్ సూపర్ స్టార్ కు అభిమానినని వెల్లడించడంతో పాటు.. ఆయనను కలిసిన క్షణాలను పంచుకున్నారు.
ఫేమస్ ఇండియన్ క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్ట్ ను షేర్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిగిన ఫోటో ను షేర్ చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్, ఈ ప్లానెట్ మీద చాలా సాధారణ వ్యక్తి అంటూ సంబోధించారు ఇర్ఫాన్ పఠాన్. ఆయన్ను కలవడం సంతోషం గా ఉంది అని పేర్కొన్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిగిన ఫోటో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.
సూపర్ స్టార్ ఈ ఏడాది జైలర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇదే జోరుతో తన నెక్స్ట్ మూవీ కి రెడీ అయిపోయారు. లేటెస్ట్ గా లియో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన డైరెక్టర్ లోకేష్ తో రజినీకాంత్ వర్క్ చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.