Asianet News TeluguAsianet News Telugu

హీరోగా మారిన మరో స్టార్ కమెడియాన్ , సిక్స్ ప్యాక్ తో సందడి చేస్తున్న సూరి

మరో స్టార్ కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ఇన్నాళ్లు ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తిన హాస్యనటుడు.. సిక్స్ ప్యాక్ తో మాస్ ఎలిమెంట్స్ తో సరికొత్త అవతారం ఎత్తాడు. మరి ఈ  కమెడియన్ అయినా హీరోగా సక్సెస్ అవుతాడా..? లేక...

Star Comedian Soori change Become a hero
Author
First Published Sep 25, 2022, 11:19 AM IST

ఇప్పటికే చాలా మంది కమెడియన్లు హీరోల అవతారం ఎత్తారు. ముఖ్యంగా టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్స్ దగ్గర నుంచి కుర్ర కమెడియన్ల వరకూ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అటు తమిళంలో కూడా స్టార్ కమెడియన్ లు కొంత మంది హీరోలుగా మారి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ సూరి హీరోగా మారిపోయాడు. వచ్చే రావడమే సిక్స్  పాక్ తో సందడి చేస్తున్నాడు. 

ఎప్పుడో ఒక చిన్న సినిమాలో ఒక చిన్న పాత్రతో తన ప్రస్థానం మొదలు పెట్టిన సూరి.. తమిళ నాట వరుస సినిమాలతో కమెడియన్ గా గుర్తింపు పొందాడు. తమిళ డబ్బింగ్ సినిమాల వల్ల ఇటు తెలుగులో కూడా సూరికి మంచి ఇమేజ్ వచ్చింది. ఇక స్టార్ కమెడియన్ గా కొనసాగుతూనే ప్రస్తుతం హీరోగా మారాడు సూరి. వెంట్రిమారన్ డైరెషన్ లో భారీ సినిమా చేస్తున్నాడు సూరి. ఈ సినిమా భారీ స్థాయిలో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో పవరు ఫుల్ రోల్ చేస్తున్నాడు సూరి. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ సినిమా స్టార్ట్ అయ్యిందో లేదో.. మరో నాలుగైదు సినిమాలు ఆయనకోసం ఎదురు చూస్తున్నాయి. సూరికి వరుసగా హీరో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. వెంట్రీమారన్ తో ఆ సినిమా త్వరగా కంప్లీట్ చేయడంటూ.. రిక్వెస్ట్ లు కూడా వస్తున్నాయట. ఇక  సూరికి ఓ రెండు మూడేళ్లు హీరోగా ఢోకా లేదనే చెప్పాలి. అయితే హీరోగా మారిన కమెడియన్లు పెద్దగా సక్సెస్ లు చూసింది లేదు. తమిళంలో వడివేలు, సంతానం లాంటి  స్టార్ కమెడియన్లు కూడా హీరోలుగా ట్రై చేసి.. మళ్లీ కామెడీ పాత్రలకే పరిమితం అయ్యారు. మరి సూరీ అయినా హీరోగా సెట్ అవుతాడా.. లేక బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి. 

ఇటు టాలీవుడ్ లో కూడా కమెడియన్లు చాలా మంది హీరోలుగా అదృష్టం పరీక్షించుకున్నారు. సునిల్, సప్తగిరి, సత్యం రాజేష్,  ధన్ రాజ్, ఇలా చాలా మందికమెడియన్లు హీరోలుగా సెట్ అవ్వక తిరిగికామెడీ పాత్రలే చేసుకుంటున్నారు. కాని అలీ లాంటి కొంత మంది మాత్రమే అటు కమెడియన్స్ గా.. ఇటు హీరోలుగా ఒకప్పుడు రాణించారు. అలీ కూడా ప్రస్తుతం కమెడియన్ గానే కొనసాగుతున్నాడు.  అయితే కమెడియన్స్ గా ఉన్నవారు హీరోలుగా సక్సెస్ అవ్వడం కష్టం కాని.. మొదటి నుంచి కామెడీ ఇమేజ్ తో పాటు హీరో ఇమేజ్ కూడా ఉన్న రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ లాంటి వారు మాత్రం కామెడీ హీరోలుగా తమ సత్తా చాటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios