హీరోయిన్ అవుతానంటున్న కమెడియన్ కూతురు.. వద్దంటున్న తండ్రి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 3, Sep 2018, 12:38 PM IST
star comedian says no to daughter
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులు తమ ఇంట్లో ఆడపిల్లలను నటన వైపు ప్రోత్సహించడానికి ఇష్టపడరు. ఎక్కడో కొంతమంది మాత్రం తన కూతుర్లను సినిమా రంగంవైపు వెళ్లమని ఎంకరేజ్ చేస్తుంటారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులు తమ ఇంట్లో ఆడపిల్లలను నటన వైపు ప్రోత్సహించడానికి ఇష్టపడరు. ఎక్కడో కొంతమంది మాత్రం తన కూతుర్లను సినిమా రంగంవైపు వెళ్లమని ఎంకరేజ్ చేస్తుంటారు. మెగాడాటర్ నిహారిక కొణిదల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ కమెడియన్ కూతురు కూడా సినిమాలోకి రావాలని ఆశ పడుతోంది.

హీరోయిన్ గా రాణించడం కోసం ఈ 17 ఏళ్ల అమ్మాయి ఇప్పటినుండే తన బాడీ షేప్ మీద దృష్టి పెట్టి హాట్ లుక్స్ తో కనిపించడానికి ప్రయత్నిస్తోంది. అయితే కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై సదరు కమెడియన్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారట. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫేమస్ అయిన సదరు కమెడియన్ తన కూతురిపై కూడా నెగెటివ్ కామెంట్స్ వస్తాయేమోననే భయంతో ఆమెకు అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ అవ్వాలనే ఆలోచన పక్కన పెట్టి .. విదేశాలను వెళ్లి విజువల్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం సాధించమని ఆమెకు క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. తన భార్య కూడా కూతురికి సపోర్ట్ చేస్తుండడంతో విడాకులు ఇచ్చేస్తానని బెదిరించి ఆమె నోరు మూయించారట. ఈ విషయంపై కమెడియన్ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయని సమాచారం. 

loader