ప్రభాస్ తో నటించను యాంకర్ శ్రీముఖి కామెంట్స్, కారణం ఏంటో తెలుసా..?
ప్రభాస్ తో సినిమా అంటే చిన్న పాత్రైనా ఎగిరి గంతేస్తారు. అందులోను లేడీస్ అయితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అటువంటిది ప్రభాస్ సినిమాకు నో చెప్పిందంట యాంకర్ శ్రీముఖి.

ప్రభాస్ తో యాక్ట్ చేయడం అంటే ఎవరు నో చెపుతారు చెప్పండి. ప్రభాస్ పక్కన యాక్ట్ చేయడం అంటే.. ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు.అందులో లేడీస్ అయితే.. వెంటనే ఒకే చెప్పేస్తారు. ఇక హ్యాండ్సమ్ స్టార్ తో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేయడం అంటే.. ఇక అదృష్టం వరించినట్టే.. కాని అటువంటి అదృష్టం కోరి ఇంటికి వెతుక్కుంటూ వస్తే.. నో చెప్పిందట యాంకర్ శ్రీముఖి. అదేంటి ఇంత మంచి గోల్డెన్ ఆఫర్ ను ఆమె ఎందకు నో చెప్పిందని అందరకి డౌట్ రావచ్చు కదా.. ఇంతకీ విషయం ఏంటంటే..?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా వెలుగు వెలుగుతోంది శ్రీముఖి. ఆమధ్య బిగ్ బాస్ హౌస్ లోకి వకూడా వెళ్లి సందడి చేసింది. అంతే కాదు శ్రీముఖి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడమే నటిగా ఎంటర్ అయ్యింది. హీరోయిన్ అవ్వాలి అనుకున్న ఆమెకు క్యారెక్టర్ రోల్స్ మాత్రమే వచ్చాయి. జులాయ్ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా.. నేను శైలజాలో రామ్ అక్కగా.. నటించి మెప్పించింది బ్యూటీ. ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ... ఫుల్ టైమ్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.
ఇక ఈక్రమంలో శ్రీముఖికి సబంధిచిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బుల్లితెర రాములమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి అప్పట్లో మంచి ఆఫర్ వచ్చిందట. ప్రభాస్ సినిమాలో నటిచేందుకు ఆఫర్ వచ్చినా సరే శ్రీముఖి రిజెక్ట్ చేసింది . దానికి కారణం కూడా లేకపోలేదు. ఆమె ప్రభాస్ కి డై హార్ట్ ఫ్యాన్ కావడం.. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ చెల్లెలుగా శ్రీముఖిని అనుకున్నారట మేకర్స్.
అయితే ఆమె ఈ క్యారెక్టర్ ను తీవ్రంగా వ్యతిరేకించిందట. ప్రభాస్ కూడా ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి ఓకే చేశారట. కానీ శ్రీముఖి ఆఫర్లు సున్నితంగా రిజెక్ట్ చేసిందట . “ప్రభాస్ నా డార్లింగ్.. ఆయన డై హార్ట్ ఫ్యాన్ నేను ..ఆయనకి సిస్టర్ గా నేను నటించను ..అన్నా అంటూ నా నోటితో నేను పిలవలేను “అంటూ పెద్ద ఆఫర్ని రిజెక్ట్ చేసిందట.
ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో శ్రీముఖి ఇంత పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని తెలిసి.. అంతా ఔరా అంటున్నారు. అభిమానం ఇంత పిచ్చిగా ఉంటుందా అని అంటున్నారు. అప్పట్లో ఈ న్యూస్ వైరల్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం శ్రీముఖికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.