గూజ్ బంప్స్ తెప్పించే పిక్-షేర్ చేసిన జక్కన్న

First Published 3, Apr 2018, 4:51 PM IST
ssrajamouli shares a pic on social media from lahore
Highlights
గూజ్ బంప్స్ తెప్పించే పిక్-షేర్ చేసిన జక్కన్న

బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన సినిమాను తెరకెక్కించిన దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి ప్రస్థుతం పాకిస్తాన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు తెరకెక్కించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రంతో రాజమౌళి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు.

 

జక్కన్న పాకిస్తాన్ రాజధాని లాహోర్ లోని చారిత్రక ప్రదేశం సాద్మన్ చౌక్ సందర్శించిన రాజమౌళి ఆ ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ని బ్రిటిషు వారు ఉరి ప్రాంతం ఇదే. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే తన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు.

 

ఇదిలా ఉండగా బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి.. రాంచరణ్, ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ చిత్రానికి తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

loader