ఈ మూవీని ఆగస్ట్‌లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వచ్చి అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ 28వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఓ రేంజిలో అంచనాలు ఏర్పడ్డాయి. హారిక హాసిని బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే తో పాటుగా ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన ఇంటి సెట్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని ఆగస్ట్‌లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వచ్చి అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం బిజినెస్ గురించిన ఓ హాట్ న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...
ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ భారీగా ఉంది. మొత్తంగా ఓవర్సీస్ హక్కులను రూ. 24 కోట్లకు కోట్ చేస్తున్నారట. అయితే ఇందులో యుఎస్ఏ హక్కులు రూ. 16 కోట్లని తెలుస్తోంది. ఇది భారీ మొత్తం అని ట్రేడ్ అంటోంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క ఒటిటి హక్కులని రూ.81 కోట్లకి ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక ఈ మూవీలో మహేష్ బాబు మంచి మాస్ యాక్షన్ రోల్ పోషిస్తుండగా జగపతి బాబు నెగటివ్ రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ భారీ ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగష్టు 11 న విడుదల కానుంది.
