Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli: మహేష్ కోసం ఆయన నవలలు, ఇండియానా జోన్స్ కలిపి కథ వండుతున్నాం

రాజమౌళి   ఈ సినిమా ఎలా ఉండబోతోంది..ఎలాంటి జానర్ వంటి విషయాలు మెల్లి మెల్లిగా రివీల్ చేస్తూ వస్తున్నారు.  వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్న ఈ చిత్రం గురించి రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో అన్న మాటలు చూద్దాం.  

SS Rajamouli on his next with Mahesh Babu like Indiana Jones, Dan Brown novels
Author
First Published Nov 20, 2022, 8:44 AM IST


టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏమిటీ అంటే రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతోంది అని. ఈ సారి ఎడ్వెంచర్ ఫిల్మ్ చేస్తానని రాజమౌళి అనగానే అనేక వార్తలు, రూమర్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే రాజమౌళి సైతం ఈ సినిమా ఎలా ఉండబోతోంది..ఎలాంటి జానర్ వంటి విషయాలు మెల్లి మెల్లిగా రివీల్ చేస్తూ వస్తున్నారు.  వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్న ఈ చిత్రం గురించి రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో అన్న మాటలు చూద్దాం.  

రాజమౌళి మాట్లాడుతూ... "మా నాన్నగారు విజయంద్రప్రసాద్...నా సినిమాలన్నిటికి కథలు రాస్తూంటాు. ఆయన ,నా కజిన్ కాంచి,,నేను కలిసి ఓ కథను గత కొద్ది రోజులుగా డవలప్ చేస్తున్నాము. అదో ఎడ్వెంచర్ కథ. నేను చాలాకాలంగా ఇలాంటి కథ చేయాలనుకుంటున్నాను. ఇండియానా జోన్స్ తరహా కథ అది. నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇండియనా జోన్స్. ఆ సినిమాని నాకు ఇష్టమైన ...డానీ బ్రౌన్ నవల తరహాలో నేరేట్ చేస్తాను.  గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్” గా   ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఇదంతా ఎర్లీ రైటింగ్ స్టేజెస్ లో ఉంది" అని చెప్పారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని కే.ఎల్ నారాయణ తన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మే  లేదా జూన్  2023 లాంచ్ జరుగుతుంది. 

 ఇండియానా జోన్స్ అనేది ప్రపంచం అంతటా భారీగా సక్సెస్ సంపాదించుకున్న అమెరికన్ హాలీవుడ్ మూవీ ఫ్రాంచైజీ. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ధ్వారా 1981 తెరమీదకు వొచ్చిన పాత్ర ఇండియానా జోన్స్. ఆ తరువాత 1984 లో ఇండియానా జోన్స్ మరియు టెంపుల్ ఆఫ్ డూమ్, 1989లో ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, 2008లో ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ సినిమాలతో ఇండియానా జోన్స్ పాత్ర ప్రపంచమంతా  అంతా పేరు తెచ్చుకుంది.

గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అంటే ఏమిటంటే..ఇలాంటి  సినిమాలో హీరో ..ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూ సాహసం తో కూడిన విన్యాసాలు చేస్తుంటాడు. దాదాపు జేమ్స్ బాండ్ సినిమా టైప్ అన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios