Asianet News TeluguAsianet News Telugu

నాకు నవ్వు దానితో సమానం.. తేజపై సంచలన వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి

వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి తాజాగా  దర్శకుడు తేజపై విరుచుకుపడింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

srireddy sensational comments on director teja arj
Author
Hyderabad, First Published Dec 18, 2020, 2:22 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి షాకింగ్‌ విషయాలు, సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి తాజాగా  దర్శకుడు తేజపై విరుచుకుపడింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

ఇందులో శ్రీరెడ్డి మాట్లాడుతూ, `తేజగారు మీరు అనుభవం ఉన్న దర్శకులు. మేం స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో మీరు డైరెక్షన్‌ చేశారట. మీ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. మీరు వివాదాస్పద దర్శకులు కూడా. అమ్మాయిల్ని కొరతారంట. అప్పటి నుంచే మీ మీద నాకు కోపం ఉండేది. మీ కోపం, టార్చర్‌  ట్రెండ్‌ అయ్యింది. ఒకప్పుడు మీకు నేను అభిమానిని. కానీ ఆ అభిప్రాయం మారిపోయింద`ని పేర్కొంది. 

ఇంకా చెబుతూ, `మీరు యూట్యూబ్‌లో నాపై చేసిన కామెంట్‌ చూశా. మీకు చాలా గౌరవం ఏం చెప్పాలనుకున్నా అంటే `మీరు నాకు అది` అని అసభ్యకరమైన రీతిలో వార్నింగ్‌ ఇచ్చింది. `ఇంకెప్పుడు నాకు వార్నింగ్‌ ఇవ్వకండి. ఏ అమ్మాయితే అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయం. రెండు మూడు హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం సంఘ సంస్కర్తవేం కాదు. నువ్వేం గొప్పవాడివి కాదు. ఇండస్ట్రీ అందరిదీ. తప్పులు జరుగుతున్నప్పుడు నాలాంటి అమ్మాయిలు ప్రశ్నించాలి. నేనొక న్యూస్‌ రిపోర్టర్‌ని, న్యూస్‌ రీడర్‌ని, యాంకర్‌ని.. ప్రశ్నించే హక్కు ఉంది` అని చెప్పింది. 

`నువ్వు రామ్‌గోపాల్‌ వర్మ కాలికి కూడా సరిపోవు. నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు సురేష్‌బాబుకి తొత్తువి. వాళ్ళ ఆస్థాన డైరెక్టర్‌వి. వాళ్లనేదో లేపాలని అనుకుంటావు. నువ్వు లేవలేవు, వాళ్ళని లేపలేవు. కిందా మీదా అన్నీ మూసుకుని పని చూసుకో` అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీరెడ్డి స్పందించింది తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కావడం గమనార్హం. 

గతంలో శ్రీరెడ్డిపై, క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆయన స్పందిస్తూ, `ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా? నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకు లాగాలని చూస్తే, ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని లేరు. ఎవరూ ఇండస్ట్రీని ఏం లాగలేరు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఏం వచ్చినా ఏం పీకలేరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి అయినా సరే ఇండస్ట్రీని ఏం చేయలేరు. శ్రీరెడ్డి ఏదో చూసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు తప్పితే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదు. ఎవరికి రోడ్డుకి లాగేటంత సీన్ లేదు` అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios