కింగ్ ఆఫ్ టాలీవుడ్ తారక్: శ్రీరెడ్డి

srireddy comments on jr ntr
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు శ్రీరెడ్డిదే.. 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు శ్రీరెడ్డిదే.. కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాను అని చెప్పుకుంటూ పలువురిపై అర్ధంలేని ఆరోపణలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మధ్యలో కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిన శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. 

మొన్నటివరకు నానిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నాని కూడా ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటూ నోటీసులు పంపించారు. ఇదంతా పక్కన పెడితే శ్రీరెడ్డి తాజాగా నటుడు ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఫేస్ బుక్ లో ఓ కామెంట్ పెట్టింది. ''ఈ తరానికి జూనియర్ ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ టాలీవుడ్.. బిగ్ బాస్ కు సింహం లాంటి వారు'' అని పోస్ట్ చేసింది.

దీంతో కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే మరికొందరు మాత్రం అందరి ఒపీనియన్స్ నువ్వెలా డిసైడ్ చేస్తావంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. శ్రీరెడ్డి ఎన్టీఆర్ పై ప్రసంశలు కురిపించడం ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా ఆమె నాని దూషిస్తూ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా తారక్ మాత్రమే వ్యవహరించగలడు అంటూ కామెంట్లు చేసింది. 

loader