Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. మంచి కుటుంబ కథ కావటంతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంది. ఇక ఈరోజు మార్చి 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మీ నానమ్మకి బొట్టు పెట్టు అని అంటాడు వెంకట్రావు. బిట్టు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి నీకు బొట్టు ఎవరు పెడతారు అని అడుగుతాడు. నాకు బొట్టు పెట్టేవాడు పైకి పోయాడు అంటుంది ఆమె. తాతయ్య నీకు బొట్టు పెట్టమని నాతో చెప్పాడు అంటే సరే పెట్టమంటుంది ఆమె.
మీ నానమ్మకి రంగులు పూయు నీ జీవితం రంగుల మయమవుతుంది అంటూ రామలక్ష్మి కి చెప్తాడు వెంకట్రావు. రామలక్ష్మి కూడా ఆమె చెంపలకి రంగులు పూసి హ్యాపీ హోలీ చెప్తుంది. ఎవరు చెప్పారు నాకు రంగులు పూయమని అంటూ కేకలు వేస్తుంది ఆమె. మావయ్య చెప్పాడు అంటుంది రామలక్ష్మి. ఇదంతా నీ పని అంటూ కర్ర పట్టుకుని వాళ్ళని పరిగెత్తిస్తుంది నానమ్మ.
అంతలోనే అటువైపుగా వస్తున్న రామలక్ష్మి తండ్రికి టేప్ రికార్డర్ లో నుంచి లే, లే నా రాజ అనే పాట వస్తుంది. పాట విన్న వెంకటరావు అమ్మో ఈ పాట వస్తుంది ఏంటి బావగారు వింటే అంతే సంగతులు అంటూ కంగారుగా వెళ్లి పాటను మార్చి పెడతాడు. సీరియస్ గా వెళ్లి బిట్టు భుజం మీద చేయి వేస్తాడు రామలక్ష్మి తండ్రి. భయం భయంగా హ్యాపీ హోలీ చెప్తాడు బిట్టు.
అతను కూడా హ్యాపీ హోలీ చెప్పి వెళ్ళిపోతాడు. అదే సమయంలో వంటను చూస్తూ ఉండండి కొత్తిమీర తీసుకొని వస్తాను అని రామలక్ష్మి తల్లికి అప్పజెప్పి వెళ్తాడు వంటవాడు. ఆమె కొంగుకి మంట అంటుకోబోతుంది. అది గమనించిన రామలక్ష్మి తండ్రి ఏం చేయాలో తెలియక హోలిరంగులతో ఆ మంటని అర్పేస్తాడు.
తనతో హోలీ ఆడుతున్నాడు అని భావించిన ఆమె హోలీ అంటే ఇష్టం లేనట్టు పెద్ద బిల్డప్పు, ఎవరు లేనప్పుడు మాత్రం నాపై రంగు చల్లారు. మీ సరసాలు నాకు తెలుసు అంటూ ఆమె కూడా అతని మీద రంగు పూస్తుంది. ఇంతలో ఆద్య ఏది అంటూ అక్కడికి వస్తాడు శీను. తను తన వీడియో పెట్టిన వాడి గురించి ఆలోచిస్తుంది అంటుంది రామలక్ష్మి.
బయట పెట్టింది నేనైతే వాడెవడు గురించి ఆలోచించడమేంటి అంటాడు అతను. మొద్దు, నేను చెప్పేది కూడా అదే నీ గురించే ఆలోచిస్తుంది అంటుంది రామలక్ష్మి. అవును కదా ఇంకా ఏమంటుంది అంటాడు శీను. నిన్ను కలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఇప్పుడు ఆద్య మైండ్ నిండా నువ్వే ఉన్నావు మీరు చూసుకొని వెళ్లి చెప్పొచ్చు కదా అంటుంది రామలక్ష్మి.
చెప్తాను అంటాడు శీను. ఎప్పుడు చెప్తావు ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు ఉండు నేను వెళ్లి తనని పిలుస్తాను అంటుంది రామలక్ష్మి. సరే నేను వెళ్లి ఆ చెట్టు కింద ఉంటాను అక్కడికి వచ్చేయమను అంటూ శీను వెళ్ళిపోతాడు. టేప్ రికార్డర్ దగ్గర ఉన్న ఆది దగ్గరికి వెళ్లి శీను బావ నేను రమ్మంటున్నాడు అని చెప్తుంది రామలక్ష్మి. అయితే ఆ సౌండ్ కి ఆమె మాటలు వినబడవు ఆద్యకి.
ఈ లోపు బిట్టు రంగులు పూయటానికి రావడంతో అక్కడి నుంచి పరిగెట్టు వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కానీ ఆ మాటలు చారు వింటుంది. శీను దగ్గరికి వెళ్తుంది. వెనక్కి తిరిగి ఉన్న శీను.. వచ్చింది ఆద్య ఏమో అనుకోని నీకు ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను చూడకుండా చెప్తున్నాను అంటే కారణం నేను నిన్ను చూస్తే చెప్పాలనుకున్నది చెప్పలేను.
నాకు చారుతో ఎంగేజ్మెంట్ అయింది కానీ అది నా ఇష్టంతో కాదు అప్పుడున్న పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు చారుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఐ లవ్ యు అంటాడు శీను. ఆ మాటలకి షాక్ అవుతుంది చారు. ఇదేది గమనించని శీను ఇంకా ఏవేవో చెప్పుకుంటూ వెళ్లిపోతాడు. నీకు మీ అమ్మ లేని లోటుని తీరుస్తాను.
మనం పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబం మరింత దగ్గరవుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు శీను. సడన్ గా అడిగితే నీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడే సమాధానం చెప్పమని అడగటం లేదు ఆలోచించుకొని నా మీద గ్రీన్ కలర్ కొట్టు. లేకపోతే నా మీద రెడ్ కలర్ కొట్టు.నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శీను.
ఇవేవీ తెలియని ఆద్య, బిట్టుతో ఆడుతూ శీను మీద గ్రీన్ కలర్ కొడుతుంది. శీను తన లవ్ ని యాక్సెప్ట్ చేసిందేమో అనుకుని తెగ ఆనంద పడిపోతాడు. చారు మాత్రం శీను మాటలు తలుచుకొని బాధపడుతుంది. హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్న ఆద్య దగ్గరికి శీను ఆమెని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు. దింపు ఏమైంది నీకు అంటూ కసురుకుంటుంది ఆద్య.
ఆమెని దింపిన శీను తనని గట్టిగా హత్తుకుంటాడు. అతన్ని వదిలించుకుని గట్టిగా చంప దెబ్బ కొడుతుంది ఆద్య. ఏమనుకుంటున్నావు పిచ్చిపిచ్చిగా ఉందా, ఫ్రెండ్లీగా ఉంటున్నాను అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి అడ్డమైన తిరుగుళ్ళు తిరగటం అలవాటు అనుకుంటున్నావేమో, ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలో నీకు తెలియదు.
నేను అమెరికాలో పుట్టి పెరిగిన కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నాను నన్ను మా అమ్మ అలా పెంచింది అంటుంది ఆద్య. ఆమె ప్రవర్తనకి ఒక్కసారిగా షాక్ అయిన శీను అది కాదు అంటూ ఏదో చెప్పబోతుంటే నన్ను తాకినప్పుడే నీకు మాట్లాడే అర్హత పోయింది. ఇప్పుడిప్పుడే నీ మీద నేను అభిప్రాయం వస్తుంది కానీ నాతో మంచిగా ఉండటం వెనకాల ఇంత నీచమైన ఆలోచన ఉందని ఇప్పుడే అర్థమైంది.
మీలాంటి మగవాళ్ళ వల్లనే ఫ్రెండ్ గా ఉండాలని ఆలోచన ఆడపిల్లలకి చచ్చిపోతుంది అంటూ శీను ని చీదరించుకుంటూ వెళ్ళిపోతుంది ఆద్య. ఏమి అర్థం కానట్లుగా ఉండిపోతాడు శీను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
