దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఏదైనా సినిమాకీ అంటే.. అది కచ్చితంగా హిట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. కానీ కొన్ని సినిమాల్లో ఆ  అంచనా తప్పుతోంది.  ఇటీవల విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ అందుకు ఉదాహరణ.

నితిన్, రాశీఖన్నా జంటగా సతీష్ విగ్నేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చాలా మంది ఈ సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోయారు.

ఈ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన టాక్ విని దిల్ రాజు షాకయ్యాడట. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడంతో అసలు ఫ్యామిలీ సినిమాలు తీయడం ఆపేద్దామా అని అనుకున్నారట.

కానీ.. రెండు రోజుల తర్వాత సినిమాని ప్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారని.. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయని తెలిసి సంతోషంగా ఫీలైనట్లు తెలిపారు.  ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రాల్లో ఫ్యామిలీ సినిమాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.