Asianet News TeluguAsianet News Telugu

అవతార్ 2 కు తెలుగులో అవసరాల శ్రీనివాస్ మాటల సాయం

తెలుగుతో పాటు దాదాపు 160 దేశాల్లో  గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుందిఅవతార్ 2. అయితే  ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగుగో అవతార్ 2 సినిమాకు నటుడు, దర్శకుడు, రచయిత  అవసరాల శ్రీనివాస్‌.. సాయం తీసుకున్నారు. 

Srinivas Avasarala Penned Dialogues For Avatar2
Author
First Published Dec 13, 2022, 2:29 PM IST

ప్రపంచంతో పాటు ఇండియన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అవతార్ 2. ఇప్పటికే హాలీవుడ్ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఇక్కడ ప్రభంజనం సృష్టించాయి. అవతార్ 1 కూడా మనదగ్గర తెగ ఆడేసింది. మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 16న ఇండియాలో రిలీజ్ కాబోతోంది అవతార్ 2.  ఎప్పుడెప్పుడు  ఈమూవీ చూద్దామా అని మన వాళ్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  కామన్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతో ఆరాటంతో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. 

ఇక ఇప్పటికే రిలీజైన అవతార్ 2 ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేసింది. గతంలో అడివిని తీసుకున్నా దర్శకుడు ఈసారి సముద్ర గర్భంలో జేమ్స్‌ కామెరూన్‌ ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు  దాదాపు 160 దేశాల్లో  గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. 

అయితే  ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగుగో అవతార్ 2 సినిమాకు నటుడు, దర్శకుడు, రచయిత  అవసరాల శ్రీనివాస్‌ మాటలు అందించాడట. అవసరాల శ్రీనివాస్‌ టాలీవుడ్‌ కు మల్టీటాలెంటెడ్ గా  సుపరిచితమే. రీసెంట్ గా రిలీజ్ అయిన  సుధీర్ బాబు సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి  సినిమాలో డా.వరుణ్‌ పాత్రలో నటించాడు. కాగా శ్రీనివాస్‌కు అవతార్‌ సినిమాకు డైలాగ్స్‌ రాసే అవకాశంవచ్చినట్టు తెలుస్తోంది. 

ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే.. రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన బ్రహ్మస్త్ర సినిమా  తెలుగు వెర్షన్‌కు కూడా అవసరాల శ్రీనివాసే మాటలు రాశాడు. ఈయన సినిమాల్లోని డైలాగ్స్‌ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యాయో తెలిసిందే. ఈరకంగానే అవతార్‌కు కూడా  డైలాగ్స్ రాసి ప్రేక్షకులను మెప్పిస్తాడని టాలీవుడ్ ఆడియన్స్ నమ్మకంతో ఉన్నారు. 

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా బిజీగా ఉన్నారు. యంగ్ టాలీవుడ్ హీరో నాగశౌర్యతో  ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దానితో పాటుగా  అవతార్‌-2 కి కూడా వర్క్ చేశాడు అవసరాల. ఇక ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. టికెట్స్ బుకింగ్ విషయంలో ఫస్ట్ డేనే 7 కోట్లకు పైగా వసూలు చేసింది అవతార్2.  

ఇప్పటికీ అవతార్‌-2 టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం పీవీఆర్‌, సినీ పోలిస్‌, ఐనాక్స్‌ వంటి మల్టీ ప్లెక్స్‌లలో ఇప్పటి వరకు దాదాపు మూడున్నర లక్షల టిక్కెట్‌లు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్‌ కాబోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios