Asianet News TeluguAsianet News Telugu

రా.. రా... మూవీ రివ్యూ.. శ్రీకాంత్ కష్టపడ్డాడు.. ఫలితం?

  • చిత్రం : రా.. రా...
  • నటీనటులు : ​శ్రీకాంత్‌, నజియా, సీతా నారాయణ, జీవా, గెటప్‌ శ్రీను, వేణు, పోసానీ కృష్ణమురళీ, రఘుబాబు
  • సంగీతం : రాప్‌ రాక్‌ షకీల్‌
  • నిర్మాత : ఎం.విజయ్‌
  • ఆసియానెట్ రేటింగ్ : 2.5/5
srikanth raa raa movie review

కథ :

సినిమా దర్శకుడిగా సక్సెస్ కావాలనుకునే రాజ్‌కిరణ్‌ ( శ్రీకాంత్‌) తండ్రి ( గిరిబాబు) ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్‌. గిరిబాబు తీసిన వంద సినిమాల్లో ఒక్కటి తప్పా మిగిలినవన్నీ హిట్‌ సినిమాలు తీసిన గొప్ప దర్శకుడిగా గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కెక్కుతాడు. అతని కొడుకు (శ్రీకాంత్‌) డైరెక్టర్‌ కావాలనుకుంటే నిర్మాతలు క్యూ కడతారు. అయితే తీసిన ప్రతి సినిమా బెడిసికొడుతుంది. చివరకు ఒక సినిమాను  గిరిబాబు ప్రొడ్యూస్‌ చేస్తాడు. సినిమా రిజల్ట్‌ రివర్స్‌ కావడంతో గుండె ఆగి చనిపోతాడు. అది చూసి శ్రీకాంత్‌ తల్లికి గుండెపోటు వస్తుంది. ఆమెను బతికించుకోవాలంటే తనకు సంతోషంగా ఉండే పని చేయమని డాక్టర్స్‌ రాజ్‌కిరణ్‌కు సలహా ఇస్తారు.  తల్లి సంతోషంగా ఉండాలంటే కనీసం ఒక్క హిట్‌ సినిమా తీస్తే చాలనుకుంటాడు. అయితే హిట్‌ సినిమా తీయడాని​కి రాజ్‌కిరణ్‌ పడ్డ కష్టాలేంటీ? సినిమా తీసే ప్రయత్నంలో దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేమిటీ? అసలు దెయ్యాలుండే ఇంటికి రాజ్‌కిరణ్‌ ఎందుకు వెళ్లాడు?  సినిమా ఎవరితో తీశాడు? అది హిట్టా లేక ఫట్టా ? వీటికి సమాధానాలే రా..రా.. సినిమా. 

 

విశ్లేషణ :

హారర్‌ మూవీకి ఎప్పుడూ సక్సెస్‌ స్కోప్‌ ఉంటుంది. దానికి తోడు కామెడీ జోడిస్తే సినిమాకు మినిమమ్‌ గ్యారెంటీ అని టాలీవుడ్‌ నమ్మకం. కాబట్టే వరుస పెట్టి అదే ధోరణిలో సినిమాలు వస్తున్నాయి. అయితే అన్ని సినిమాల కాన్సెప్ట్‌ ఒకటే. కాసింత భయపెట్టడం. కాసింత నవ్వించడం. అయితే కథ, కథనం, పాత్రలను మలిచే విధానం, సందర్భానుసారంగా వచ్చే కామెడీ, ట్విస్ట్‌లు ఏవీ లేకుండా ఊరికే బీజీ మ్యూజిక్‌తో భయపెట్టేసి, కమెడియన్స్‌ భయపడుతూ ప్రేక్షకులను నవ్విద్దామనుకుంటేనే తంటా తప్పదు. ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్‌ ఉండదు.  మనుషులను చూసి దెయ్యాలు భయపడటం.. దెయ్యాల్లో కూడా కామెడీ దెయ్యాలుండటం.. లాంటివి కనెక్ట్ కాలేదనిపిస్తుంది. దెయ్యాన్ని హీరో లవ్‌ చేయడం ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూపించినా ఇందులో మాత్రం వర్క్‌ అవుట్‌ కాలేదు. ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపించింది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లు అంతగా మెప్పించలేకపోయాయి. తనను తాను నిరూపించుకోవడానికి గత చిత్రాల మాదిరిగానే ఈసినిమాలో కూడా శ్రీకాంత్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌ తన నటనతో మెప్పించాడు. ఇక నజియా, సీతా నారాయణలు కూడా తమ పరిధి మేరకు ప్రేక్షకులను అలరించారు. కమెడియన్స్‌గా నటించిన వేణు, పోసాని, రఘుబాబు, రఘు కార్మంచి, షకలక శంకర్‌, వేణు, పృథ్వీ, గెటప్‌ శ్రీను బాగానే నవ్వించారు.  శ్రీకాంత్‌ నటన, కామెడీ సీన్స్‌ సినిమాకు హైలైట్ గా నిలువగా... కథలో సీరియస్‌నెస్‌ లేకపోవడం, స్ర్కీన్ ప్లేలో సీన్స్ మధ్య లింక్ కట్ అయినట్లు అనిపించడం మైనస్ గా మారింది.

 

చివరగా :

రా..రా..అన్నారు. కానీ ఏమీ చూపించ లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios