Asianet News TeluguAsianet News Telugu

Kothala Rayudu Review: శ్రీకాంత్‌ `కోతల రాయుడు` మూవీ రివ్యూ..

ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్‌ కెరీర్‌ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌గా సాగుతుంది. హీరోగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావడం లేదు. ఇలాంటి సమయంలో ఆయన హీరోగా నటించిన చిత్రం `కోతలరాయుడు` శుక్రవారం(ఫిబ్రవరి 4న) విడుదలయ్యింది. సుధీర్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

srikanth kothala rayudu movie review
Author
Hyderabad, First Published Feb 4, 2022, 8:19 PM IST

ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్‌ కెరీర్‌ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌గా సాగుతుంది. హీరోగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావడం లేదు. మరోవైపు ఇటీవల `అఖండ` చిత్రంలో విలన్‌గా నటించినా ఆయనకు పెద్దగా పేరు రాలేదు. మరోవైపు వెబ్‌ సిరీస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన హీరోగా నటించిన చిత్రం `కోతలరాయుడు` శుక్రవారం(ఫిబ్రవరి 4న) విడుదలయ్యింది. సుధీర్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

కథః 
శ్రీకాంత్ (అజయ్) జల్సా రాయుడు. లగ్జరీలకు అలవాటు పడి డబ్బును బాగా ఖర్చు చేస్తుంటాడు.  ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా ఉన్న అజయ్ డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) పై మనసు పడతాడు. ఆమెని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంటారు. కానీ అనుకోకుండా ధనలక్షి కుటుంబానికి అజయ్ తో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఆ తరువాత సంధ్య (డింపుల్) ని ప్రేమిస్తాడు అజయ్‌. మరి అజయ్ , ధనలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ? సంధ్యని పెళ్లి చేసుకున్నాడా? అజయ్‌ జీవితంలో చోటుచేసుకున్న మలుపులేంటనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణ: 
ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌కి ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కానీ ఇటీవల అది తగ్గిపోతుందని చెప్పొచ్చు. కానీ చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. చాలా రోజుల తరువాత  శ్రీకాంత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటించాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా `కోతల రాయుడు` సినిమాను కుటుంబం అంతా కలిసి చూడవచ్చు. కాకపోతే కథ, కథనాలు కాస్త రొటీన్‌గా అనిపిస్తుంటాయి. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. 

హీరోగా శ్రీకాంత్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తనదైన నటనతో మెప్పించారు. హీరోయిన్స్ నటశా, డింపుల్ బాగా నటించారు. కెమెరామెన్ బుజ్జి వర్క్ బాగుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ ఎపిసోడ్ ఫన్నీగా బాగుంది. పోసాని, మురళి శర్మ రోల్స్ సినిమాకు మరింత హెల్ప్ అయ్యాయి. సాంగ్స్ సిక్కింలో రిచ్ గా చిత్రీకరించారు. సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. 

డైరెక్టర్ సుధీర్ రాజు ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను బాగా నడిపించాడు. శ్రీకాంత్ ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సుధర్ బాగా సక్సెస్ అయ్యాడు. శ్రీకాంత్ ఈ మధ్య నటించిన కొన్ని చిత్రాలతో పోలిస్తే `కోతల రాయుడు` బెటర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ఈ సినిమాకు బాగా కుదిరాయి. సరదాగా సాగే టైమ్‌ పాస్‌ మూవీగా చెప్పొచ్చు. 


చిత్రం: కోతలరాయుడు
నటీనటులు:
శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: బుజ్జి
ఎడిటర్: ఉద్ధవ్
మాటలు: విక్రమ్ రాజ్, స్వామి మండేలా
ఆర్ట్ డైరెక్టర్: ఠాగూర్
పాటలు: కంది కొండ
ఫైట్స్: రియల్ సతీష్
పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మ
కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్

 

Follow Us:
Download App:
  • android
  • ios