Asianet News TeluguAsianet News Telugu

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో శ్రీకాంత్, వరలక్ష్మి 'కోట బొమ్మాళి' టీజర్.. ఫన్నీగా సంపూర్ణేష్ మూవీ ఫస్ట్ లుక్

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోట బొమ్మాలి పీఎస్. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Srikanth and varalakshmi sarath kumar kota bommali teaser out now dtr
Author
First Published Nov 6, 2023, 8:55 PM IST

'కోట బొమ్మాళి' టీజర్

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోట బొమ్మాలి పీఎస్. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. 

సినిమా ఎలా ఉండబోతోందో టీజర్ లో శాంపిల్ చూపించారు. శ్రీకాంత్ రామకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే శ్రీకాంత్ పరారీలో ఉంటూ దేనికోసమో పోరాడుతున్నట్లు చూపించారు. ఇంతలో రాజకీయ నాయకుడిగా కీలక పాత్రలో నటిస్తున్న మురళి శర్మ పాత్ర పరిచయం అవుతుంది. అతడు చేసిన క్రైం కారణంగానే శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు అర్థం అవుతోంది. 

శ్రీకాంత్ తో పాటు, శివాని రాజశేఖర్ కూడా పరారీలో ఉంది. ఇంతలో అలీ పేరుతో వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ అధికారిగా ఎంట్రీ ఇస్తుంది. నేరస్తుల్ని పట్టుకునే భాద్యత ఆమె తీసుకుంటుంది. అసలు శ్రీకాంత్ ఎలాంటి నేరంలో ఇరుక్కున్నారు. ఇందులో మురళి శర్మ హస్తం ఏంటి ? వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళని అరెస్ట్ చేయగలిగిందా అనే అంశాలు టీజర్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తంగా కోట బొమ్మాళి చిత్రం థ్రిల్లింగ్ రైడ్ లా అనిపిస్తోంది. 

సంపూర్ణేష్ బాబు 'సోదరా' ఫస్ట్ లుక్ 

సంపూర్ణేష్ బాబు, సంజోష్ ముఖ్యపాత్రలో సోదరా మూవీని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తుంది అంటున్నారు. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సంపూర్ణేష్ బాబు మరియు సంజోష్ ఇద్దరు పెళ్లి కొడుకు గెటప్ లో ఒకరు తాళి ఒకరు రోజా పువ్వు పట్టుకొని ఉండగా వెనక మేళతాళాలతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అత్యంత హాస్య భరితంగా ఉండేలా దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు మరియు సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను
కథ మరియు దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి

సంగీతం: సునీల్ కశ్య ప్ 

Follow Us:
Download App:
  • android
  • ios