సైలెంట్ గా OTTలో కి వచ్చేసిన “పెదకాపు 1” !
పబ్లిక్ టాక్, రివ్యూలు కూడా గా బాగా లేకపోవడం వల్ల మరీ దారుణంగా దెబ్బ తింది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా కూడా ఏమాత్రం లాభం లేకపోయింది.

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చెక్కిన పెదకాపు 1 సినిమా డిజాస్టర్ అయ్యింది. బ్రహ్మాత్సవం చిత్రాన్ని మించి రాడ్డు సినిమాగా పేరు తెచ్చుకుంది. వసూళ్లు విషయంలో ఈ సినిమా ట్రేడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఓపినింగ్స్ ఖచ్చితంగా వస్తారని టీం భావించింది. కానీ ఈ సినిమాకి ఓపెనింగ్ గ్రాస్ కనీసం 30 లక్షలైనా రాకపోవడం షాక్ కి గురి చేసింది. పైగా పబ్లిక్ టాక్, రివ్యూలు కూడా గా బాగా లేకపోవడం వల్ల మరీ దారుణంగా దెబ్బ తింది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా కూడా ఏమాత్రం లాభం లేకపోయింది.
విరాట్ కర్ణా హీరోగా పరిచయమైన ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. మూడు రోజుల్లో ఈ సినిమా కోటిలోపే వసూళ్లను రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 12 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు దారుణంగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్‌లోనే చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను ఎత్తేశారు. కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తడబడటంతో సినిమా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. పన్నెండు కోట్ల దాకా బ్రేక్ టార్గెట్ పెట్టుకున్న పెదకాపు 1 కోటి కూడా వసూలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే అప్పుడు చూడని ఆ సినిమాని ఇప్పుడు ఓటిటిలో చూడాలనుకుంటున్నారు శ్రీకాంత్ అడ్డాల అభిమానులు.
ఈ చిత్రం అయితే ఇప్పుడు సైలెంట్ గా చడీ చప్పుడూ లేకుండా ఓటిటి లో వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. మరి ఓటిటిలో ఏ మేరకు రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
చిత్రం కథేంటంటే: 1982లో అన్నగారు నందమూరి తారక రామారావు పార్టీ ప్రకటించిన టైమ్ లో జరిగే కథ ఇది. అన్నానికి అలవాటు పడినట్టుగా అధికారానికి అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు బయన్న (నరేన్) సత్య రంగయ్య (రావు రమేశ్) లంక గ్రామాల్లో సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ రావడంతో ఇరు వర్గాల్లో కలవరం మొదలవుతుంది. ఆధిపత్యం కోసం రక్తపాతం సృష్టిస్తారు. సామాన్యులే బలవుతారు. ఆ ప్రభావం సత్య రంగయ్య దగ్గర పనిచేసే పెదకాపు (విరాట్‌కర్ణ) కుటుంబంపైనా పడుతుంది. తన అన్న కనిపించకుండా మాయమవుతాడు. ఇంతకీ పెదకాపు అన్న ఏమయ్యాడు? ఆత్మగౌరవం కోసం పెదకాపు ఏం చేశాడు? రామారావు ఎవరికి టికెట్ ఇచ్చారు? 1960ల్లో ఆ ఊళ్లల్లో ఏం జరిగింది?అక్కమ్మ (అనసూయ) ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.