Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లో సిరి -శ్రీహాన్ , కీర్తి- మహేష్ రొమాన్స్ , కప్పు గెలవాల్సిందేన్న ఇనయా తల్లి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చివరిదశకు వచ్చింది. ఇంకా కొన్ని వారాలే ఉండగా.. కంటెస్టెంట్స్ 9 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్తారా అన్నదానిపై ఉత్కంట నెలకొంది. ఈక్రమంలోనే ఈ వారం అంతా ఇంట్లోకి కంటెస్టెంట్స్ కి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిరెడ్డి కుటుంబంతో పాటు.. రాజ్, ఫైమా, శ్రీసత్య, రోహిత్ ఫ్యామిలీ నుంచి హౌస్ లోకి వచ్చి వారికి సర్ ప్రైజ్ ఇచ్చారు. 

Srihan Lover Siri Entry on Bigg Boss Telugu Season 6
Author
First Published Nov 24, 2022, 11:56 PM IST


బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చివరిదశకు వచ్చింది. ఇంకా కొన్ని వారాలే ఉండగా.. కంటెస్టెంట్స్ 9 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్తారా అన్నదానిపై ఉత్కంట నెలకొంది. ఈక్రమంలోనే ఈ వారం అంతా ఇంట్లోకి కంటెస్టెంట్స్ కి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిరెడ్డి కుటుంబంతో పాటు.. రాజ్, ఫైమా, శ్రీసత్య, రోహిత్ ఫ్యామిలీ నుంచి హౌస్ లోకి వచ్చి వారికి సర్ ప్రైజ్ ఇచ్చారు. 


ఈక్రమంలో శ్రీహాన్ కు సబంధించిన సర్ ప్రైజ్ తో ఆడియన్స్ తో పాట ఇంట్లో వాళ్లు కూడా షాక్ అయ్యారు. శ్రీ హాన్ కోసం అందరూ ఊహించనట్టే అతని లవ్వర్ సిరి ఇంట్లోకి వచ్చింది.  అయితే సిరితో పాటు ఓ చిన్న బాబు.. కూడా వచ్చాడు.  అయితే ఈ బాబు ఎవరా అని అందరికీ  డౌట్ మొదలయ్యింది. ఇక ఆ బాబు డాడీ అంటూ శ్రీహాన్ ను పిలుస్తూ..హౌస్ అంతా సందడి చేశాడు. దాంతో అదేంటి శ్రీహాన్ కు సిరికీ పెళ్లి అవ్వలేదు కదా.. ఈ పిల్లాడు ఎక్కడినుంచి వచ్చాడంటూ షాక్ అయ్యారు అంతా. 

అయితే ఆతరువాత తెలిసిందేమిటంటే..ఆ పిల్లాడు శ్రీహాన్ అన్నవాళ్ల బాబుఅని.. శ్రీహాన్ అన్నను నాన్నా అని.. శ్రీహాన్ ను డాడీ అని పిలవడం అలవాటు  అంటూ శ్రీహాన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఆపిల్లాడి అల్లరితో ఇల్లంతా సందడి సందడిగా మారింది. అందరూ తెగ ఎంజాయ్ చేశారు. సినిమా డైలాగ్స్ తో.. షాకింగ్ కామెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ కుకొత్త సందడి తీసుకువచ్చాడు శ్రీహాన్ అన్న కొడుకు. 

ఇక సిరితో శ్రీహాన్ రొమాన్స్ కు అంతా కళ్లు మూసుకోవల్సి వచ్చింది బిగ్ బాస్ సాంగ్ కు రెచ్చిపోయి డాన్స్ వేశారు ఇద్దరు తారలు. ముద్దుల వర్షం కురిపించారు. హౌస్ అంతా సందడి చేవారు. ఇక సిరీ కూడా పాత  ఎక్స్ పీరియన్స్ ఉండటంతో.. హౌస్ లో ఉన్నవారితో ఓ పద్దతిగా మాట్లాడింది. కాని శ్రీసత్యతో మాట్లాడుతున్నట్టే మాట్లాడి... స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. 

ఇక కీర్తి కోసం హౌస్ లోకి బుల్లి తెర హీరో మహేష్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే పంచులతో అందరికి వరుసపెట్టి ఇచ్చేశాడు. ఇక కీర్తీతో డాన్స్ చేస్తూ.. హాగ్ చేసుకుంటూ.. రోజ్ ఇచ్చిప్రపోజ్ చేస్తూ తెగ సందడి చేశాడు. కీర్తిని పేపర్ చేసి.. ఆమెకు తినిపించాడు. ఇక ఫైమాను ఇంగ్లీష్ విషయంలో ఓ ఆట ఆడుకున్నాడు మహేష్. గేమ్ విషయంలో నువ్వు ఫైటర్ వీ.. జీవితంలో చాలా కోల్పోయావ్.. కాని బిగ్ బాస్ నీకు మంచి అవకాశం.. ఇక్కడ గెలిచి చూపించు అని ధైర్యం చెప్పాడు మహేష్.  ఇక వెళ్తూ.. వెళ్తూ.. ఇనయాను ముద్దు అడిగి సందడి చేశాడు మహేష్. 

ఇక హౌస్ లోకి ఆతరువాత ఇనయ తల్లి ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలంగా ఇనయాకు దూరంగా ఉంటున్న ఆమె..హౌస లోకి వచ్చి. ఇనయ చేస్తున్న పోరాటాన్ని మెచ్చకున్నారు.  అంతే కాదు...కప్పు గెలిచి  చూపించు.. కప్పుతోనే బయటకు రావాలి అంటూ  కూతురికి ధైర్యం ఇచ్చారు ఇతన మదర్. 

ఇక బిగ్ బాస్ గేమ్ లో బాగంగా  శ్రీహాన్  ప్లట్టింగ్ మాస్టార్ గా కామెడీ పండించాడు. ఇక యోగా టీచర్ గా  రేవంత్ కాస్త ప్రయత్నంచేయగా.. ఫైమాతో పాటు హౌస్ మెట్స్ .. రేవంత్ ను ఆటాడుకోవాలి అని చూశారు. ఫైనల్ గా రేవంత్ కోసం ఎవరు వస్తారా అని అతను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈలోప రాజ్ తో రేవంత్ కు పాల విషయంలో చిన్న గలాట జరిగింది. ఇక రాజ్ ను రాత్రి భయపెట్టాలని చూశారు రేవంత్, శ్రీహాన్ .  ఈ టాస్క్ లో సక్సెస్ అయ్యారు కూడా. 

Follow Us:
Download App:
  • android
  • ios