Asianet News TeluguAsianet News Telugu

మరి కొద్ది గంటల్లో భారత్ కు శ్రీదేవి మృతదేహం

  • మరి కొద్ది గంటల్లో భారత్ కు శ్రీదేవి
  • శ్రీదేవి భౌతికకాయం కుటుంబసభ్యులకు అప్పగింత
  • క్లియరెన్స్ లేఖ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అధికారులు
Sridevi Dead body reaching india by 4 hours

అందాలతార శ్రీదేవి అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడులు వీడినట్టేనా... తన అద్భుత సౌందర్యంతో, నటనతో సినీపరిశ్రమలో ఎందరికో సాధ్యం కాని అగ్ర శిఖరాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న శ్రీదేవిది హత్యా, ఆత్మహత్యా, లేక ప్రమాదమా.. ఏ కోణంలో వెతికినా వీడని చిక్కుముడిగానే మిగిలింది.

 

అయితే శ్రీదేవి మృతిపై విచారణ చేసిన దుబయి ప్రాసిక్యూషన్ వారు ఎట్టకేలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో శ్రీదేవి భౌతికకాయం కుటుంభసభ్యులకు అప్పగించారు. బోనీ కపూర్ ను సైతం పలు కోణాల్లో విచారించిన దుబయి పోలీసులు ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని, పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రస్థుతం ఎంబామింగ్ ప్రక్రియ కోసం బాడీని తరలించారు. మరో రెండు గంటల్లో ఎంబామింగ్ పూర్తయిన తర్వాత శ్రీదేవి మృతదేహం భారత్ కు తరలించనున్నారు.

 

మరోవైపు శ్రీదేవి పై రూ.100కోట్ల ఇన్సూరెన్స్ వున్నందునే... కుట్రకోణం దాగుందనే అనుమానాలు మాత్రం అలానే వున్నాయి.. ఇక శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ లపై మాత్రం తీవ్ర ప్రభావం పడింది. వాళ్లను ఓదార్చటం ఎవరి తరం కావట్లేదు.

 

శ్రీదేవి మృతదేహం మరో నాలుగు గంటల్లో ముంబయి చేరుకునే అవకాశం వుంది. ఇక వివిధ పరిశ్రమలకు చెందిన సినీ తారాలోకం మెత్తం అనిల్ కపూర్ ఇంటి వద్ద శ్రీదేవి భౌతికకాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ, తెలుగు సినీ ప్రముఖులు నిన్ననే ముంబయికి చేరుకున్నారు. రజనీకాంత్, కమల్, రాఘవేంద్రరావు
విక్టరీ వెంకటేష్ తదితరులు.

Follow Us:
Download App:
  • android
  • ios