Asianet News TeluguAsianet News Telugu

అటు తిరిగి, ఇటు తిరిగి ప్రియా ప్రకాష్ కు చుట్టుకుంది!

ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ లో “శ్రీదేవి బంగ్లా” అనే సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేస్తే హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ చివరకి బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. 

Sridevi Bungalow: Boney Kapoor Is Disgusted By Priya Prakash Varrier
Author
Hyderabad, First Published Aug 27, 2019, 2:08 PM IST

సినిమా హిట్టా..ప్లాఫా అనేది ప్రక్కన పెట్టి , కేవలం కన్నుగీటి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం ఓ చిన్న ట్రైలర్ హిట్ తో దేశ వ్యాప్తంగా పాపులర్ ఫిగరైన ఆమె ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తోంది. అయితే అదే సమయంలో ఆమె ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహానికి గురి అవుతోంది. ఆమె రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలకు ఆయన మండిపడుతున్నారు. బోనికపూర్ లాంటి బడా నిర్మాతకు కోపం వస్తే దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రియా ప్రకాష్ వారియర్ కు కొద్ది కాలంలోనే  కనపడుతుంది అంటోంది బాలీవుడ్ మీడియా. ఆమె అనవసరంగా ఈ వివాదంలోకి వచ్చి,విరోధమైంది అని అంటున్నారు. 

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ లో “శ్రీదేవి బంగ్లా” అనే సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేస్తే హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ చివరకి బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. 

ఈ ట్రైలర్ చూసిన జనం  దివంగత నటి శ్రీదేవి మరణాన్ని గుర్తు తెచ్చేలా ఉందని అన్నారు. ఈ నేపధ్యంలో ఆ చిత్రంపై శ్రీదేవి భర్త బోనికపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో శ్రీదేవి మరణించిన తరహాలో బాత్ టబ్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయటంతో వివాదం మొదలయింది. బోనీ కపూర్ వార్నింగ్ ఇచ్చినా టీమ్ పట్టించుకోకపోవటంతో ఆయన లీగల్ యాక్షన్ కు రెడీ అవుతున్నారు. అయితే చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ప్రియా వారియర్ తాజాగా స్పందించింది.

ప్రియాప్రకాష్ వారియర్ మాట్లాడుతూ..“ఈ వివాదంతో నాకు ఏ సంబంధం లేదు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు, నిర్మాతలు అవకాశం ఇచ్చారు. నటిగా నా పని నేను చేశా. దర్శక నిర్మాతలకు సంబంధించిన విషయం ఇది. వ్యక్తిగతంగా ఎవరిని భాదపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీదేవి మేడంకు నేను పెద్ద అభిమానిని. ఆమెని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు” అంది ప్రియా ప్రకాష్ వారియర్. 

ఆమె ఈ విషయమై పాజిటివ్ గా మాట్లాడినా అది బోనీకపూర్ కోపం తెప్పించిందిట. తనేమీ చిన్న పిల్లకాదని శ్రీదేవి పేరు, బాత్ టబ్ సీన్ ఎందుకని ఆ సినిమాలో వాడుతున్నారో ఆమెకు తెలుసు అని, అలాంటి వాటికి నో చెప్పాలి కదా అని ఆయన వాదనట. ఏదైమైనా శ్రీదేవి పేరు చెప్పి తమ సినిమాను క్యాష్ చేసుకోవాలనే ఆలోచన మానుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios